బిడ్డలకు పాలిచ్చే సమయంలో తల్లులు పోషకాహారం తీసుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో బిడ్డ కడుపు నింపడమే కాకుండా ఆరోగ్యాన్నిస్తున్నాను అని ప్రతీ తల్లి భావించాలి. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే.. ఆ సమయంలో ఘనాహారం కంటే ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. పాలు, పళ్లరసాలు తీసుకోవాలి.. పాలు పట్టించడానికి కనీసం ఓ అరగంట ముందైనా పళ్ల రసం తీసుకోవడం మంచిది. దీని వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. పాల ద్వారా తల్లి నుంచి చిన్నారికి కాల్షియం వెళ్తుంది. కాబట్టి కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ తల్లి  తీసుకోవడం మంచిది. అయితే, కొంతమంది ఉద్యోగినులు ఉంటారు. అలాంటి వారు నిర్లక్ష్యం చేయకుండా తల్లిపాలను సేకరించి నిల్వ చేయొచ్చు. 

 

 

 

ఇందుకోసం సక్షన్ పంప్ సాయంతో పాలు సేకరించి ఫ్రిజ్‌లో నిల్వ చేయొచ్చు. ఈ పాలను బిడ్డకు పాలు పట్టే ముందు ఫ్రిజ్ నుంచి బయటకు తీసి సాధారణ టెంపరేచర్‌కి చేరాక స్పూన్, ఉగ్గు గిన్నెతో పాలు పట్టించాలి.తల్లి పాల విషయంలో చాలామందికి అపోహలు ఉంటాయి. ముఖ్యంగా తొలి పాలు అదే ముర్రుపాలు పిల్లలకు వాతం చేస్తాయని, వాటిని పిండి పారేయాలి అని చెబుతారు. కానీ, ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ముర్రుపాలలో ‘ఇమ్యునోగ్లాబ్యులిన్స్’ ఉంటాయి. వీటిలో ఇమ్యునోగ్లాబ్యులిన్ ఎ అనే పోషకంతో బిడ్డ పేగుల వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ దొరుకుతుంది. అలాగే ఎలర్జీలు కూడా బిడ్డ దరిచేరవు. చాలా మంది బిడ్డకు పాలు సరిపోవడం లేదు అని అంటుంటారు. 

 

 


కానీ, నిజానికీ.. బిడ్డ ఎన్ని పాలు తాగితే.. ఇంకా అన్ని పాలు తల్లికి వస్తాయి. అయితే, మొదట్లో రొమ్ము నొప్పులు ఉంటాయి. కాస్తా భరిస్తే బిడ్డ రొమ్ము పీల్చుతున్న ప్రతీసారి పాలు తయారవుతూనే ఉంటాయి. అప్పుడే పాలు పట్టడం స్టార్ట్ చేస్తే  రొమ్ము నొప్పి అనేది తగ్గిపోతుంది. బిడ్డను రొమ్ము దగ్గరకు లాక్కుని పాలు పట్టించాలి. కొంతమంది పాలు ఇస్తే అందం తగ్గిపోతుంది అని భావిస్తారు. కానీ అలా చేయడం సరయిన పద్ధతి కాదు. పాలు ఇవ్వకపోతే రొమ్ముల్లో పాలు నిల్వ ఉండిపోయి గడ్డలు కడతాయి. దీనివల్ల రొమ్ముకి ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాగే బిడ్డకి తల్లికి మధ్య ఉన్న ఆప్యాయత అనేది సరిగ్గా ఉండదు.. తల్లి అవ్వడం అనేది ఒక అదృష్టం.. పిల్లలకు పాలు ఇవ్వడం అనేది తల్లికి మర్చిపోలేని ఒక గొప్ప అనుభూతి... !!

మరింత సమాచారం తెలుసుకోండి: