అమ్మాయిలు యుక్తవయసులోకి అడుగుపెట్టిన ప్రారంభదశలోనే రుతుస్రావం అనేది ప్రారంభమౌతుంది. ఇది స్త్రీ శరీరంలో జరిగే ఒక సాధారణమైన ప్రతిక్రియ. ఇక ఈ పీరియ‌డ్స్ స‌మ‌యంలో ప్రతి మహిళ ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్యను ఎదుర్కునే తీరుతుంది. ముఖ్యంగా పీరియడ్స్ కి ముందు నుంచి అలాగే పీరియడ్స్ సమయంలో నెలసరి నొప్పులు రావడం సహజమే. కొందరిలో ఈ నొప్పులు చిన్నపాటిగా ఉంటే మరికొందరిలో తీవ్రంగా ఉంటాయి. దీనికి తోడు శరీరం లో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల ఆడవాళ్ళకి పిచ్చెత్తినట్లు ఉంటుంది. అందువలన, పీరియ‌డ్స్‌ అంటేనే కాస్తంత చికాకుగా అనిపిస్తుంది. 

 

అయితే ఇలాంటి స‌మ‌యంలో కొన్ని ప‌నులు చేయ‌క‌పోవ‌డ‌మే మంచిదంటున్నారు. రుతుస్రావసమయం లో భోజననాన్ని మానకుండా తీసుకోవటం చాలా ముఖ్యం.ఈ సమయం లో మీలో రక్తస్రావం అవుతూ ఉంటుంది, అందువల్ల ఆహారం ద్వారా మాత్రమే శక్తి ని పొందగలుగుతారు. కాబ‌ట్టి, ఫుడ్ తీసుకోవ‌డం అస్సలు మాన‌కూడ‌దు. అలాగే రుతుస్రావ సమయంలో మీకు నడుము లేదా పొత్తికడుపు నొప్పి వస్తోంటే శారీరక శ్రమ ని తగ్గించుకుంటే మంచిది. లేదంటే ఈ శ్రమ మీ నెప్పిని మరింత పెంచుతుంది. దీంతో మీరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

 

అదేవిధంగా, పీరియ‌డ్స్‌ సమయంలో ఆల్కహాల్ కి దూరంగా ఉండండి. కొద్దిమొత్తంలో తీసుకుంటే ఇబ్బంది లేదనుకుంటే మీ అభిప్రాయం తప్పు. పీరియడ్స్ సమయంలో ఆల్కహాల్ ని తీసుకుంటే నెలసరి సమస్యలు మరింత ఎక్కువవుతాయి. ఇక పీరియ‌డ్స్ టైమ్‌లో కలవడం వల్ల గర్భం రాదని అపోహపడద్దు. ఈ సమయంలో గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువే. పైగా ఇన్ ఫెక్షన్ లు రాకుండా నివారించడానికి కూడా ఆ టైమ్‌లో కలవ‌క‌పోవడ‌మే బెట‌ర్‌. అలాగే పాలు, వెన్న, జున్ను వంటి వాటిని పీరియ‌డ్స్ టైమ్‌లో దూరంగా ఉండ‌డ‌మే మంచిది. ఎందుకంటే.. వీటిలో నుండే అరకిడోనిక్ యాసిడ్ అనేది నెలసరి నొప్పులను పెంచుతుంది. వీటికి బదులుగా మజ్జిగను తీసుకుంటే నెలసరి నొప్పులు తగ్గుముఖం పడతాయి.

 
   
 
 
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: