ఒక బిడ్డకి జన్మ ఇచ్చిన తర్వాత తల్లి ధ్యాస  అంతా పుట్టిన బిడ్డ మీదనే ఉంటుంది. ఆ బిడ్డ ఏడిస్తే ఎందుకు ఏడుస్తుందో అని ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. వెంటనే బిడ్డకు చనుపాలు పట్టిస్తుంది. బిడ్డ ఆకలికి ఏడిచాడని ఒక్క తల్లి మాత్రమే గ్రహిస్తుంది. అలా బిడ్డకు పాలు పట్టించేటపుడు తల్లి కొన్ని జాగ్రత్తలు పాటించాలి.. అవేంటో చూద్దాం.. తల్లికి పాలు పట్టిన తర్వాత బిడ్డను ఎత్తుకుని  వెనుకాల వీపు మీద చిన్నగా తట్టాలి. అలా తట్టడం వాళ్ళ త్రేపులు వస్తాయి.. అప్పుడే వాళ్లకి పాలు బాగా జీర్ణం అవుతాయి.

 

 


పాలు ఇవ్వడానికి ముందు, తర్వాత చనుమొనలను టిష్యూ తో గాని గుడ్డతో గాని  క్లీన్ చేయాలి.అంతేకానీ, యాంటీసెప్టిక్ లోషన్లతో క్లీన్ చేయొద్దు. అందులోని కెమికల్స్ బిడ్డ గొంతులోకి వెళ్తాయి.అలాగే బిడ్డ పాలు తాగక  బిడ్డ యొక్క పెదవులను తెల్లటి వస్త్రంతో తుడవాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు యొక్క పెదాలు నల్లబడవు. కొంతమందికి చనుమొనలు పగిలి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే ముందు నుంచే మాయిశ్చరైజింగ్ రాస్తూ ఉండాలి.పుట్టిన బిడ్డకు పాలు పట్టడం వల్ల తల్లులకు లాభాలున్నాయి. రొమ్ము, ఒవేరియన్ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లికి ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలవుతుంది.

 

 


 ఈ ఆర్మోన్ గర్భాధారణతో సంకోంచించిన గర్భాశయాన్ని కుచించుకుపోయేలా చేసి పాత పరిమాణానికి తీసుకొస్తుంది. ఈ కారణంగా రక్తస్రావ తీవ్రత తగ్గుతుంది. బిడ్డకు చనుబాలు ఇవ్వడం ద్వారా తల్లికీ, బిడ్డకూ మధ్య చక్కని అనుబంధం ఏర్పడతుంది.పాలిచ్చినంతకాలం తల్లుల్లో ప్రొలాక్టిన్ తయారువుతుంటుంది. తద్వారా అవాంఛిత గర్భం దాల్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.తల్లులు బిడ్డకు పాలివ్వడం ద్వారా ఒక్కరోజుకి దాదాపు వెయ్యి కేలరీలను బిడ్డకు అందిస్తుంది. దీంతో.. గర్భ సమయంలో పెరిగిన బరువు తగ్గుతుందిమొత్తానికీ చనుబాలు బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఖచ్చితంగా పుట్టిన తక్కువ సమయంలోనే ముర్రుపాలు తాగించాలి. దీని వల్ల వారి జీవితకాలంలో ఆరోగ్యాన్ని ఇచ్చినవారవుతారు. ఈ విషయాన్ని ప్రతి తల్లి గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: