తల్లి బిడ్డకి జన్మనిచ్చాక  చనుపాలు పట్టాలి. పొత్తిళ్లలో ఉన్న బిడ్డకు మొదటి ఆహారం అమ్మ పాలే. అయితే కొంతమంది స్త్రీలలో పాల ఉత్పత్తి అనేది సరిగా జరగదు. అందువల్ల బిడ్డకు సరిగ్గా పాలు ఇవ్వలేరు. ఫలితముగా ఫార్ములా మిల్క్, ఆవుపాలు పట్టడం లాంటివి చేస్తారు. ఒక్కోసారి ఆ పాలు పడక వాంతులు, విరోచనాలు అవుతాయి. అయితే ఈ కింద చెప్పిన ఆహార పదార్ధాలు తినడం వల్ల పాలు ఉత్పత్తి బాగా ఉంటుంది. మెంతులూ, మెంతి కూర బాలింతలకి మేలు చేస్తాయి. ఇందులో ఉండే ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్స్, మినరల్స్ తల్లికీ బిడ్డకీ కూడా మంచివి. పప్పుల్లో, కూరల్లో కొంచెం మెంతి పొడి వేసుకోవచ్చు. మెంతి కూరతో పప్పు చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. అయితే డయాబెటిక్ పేషెంట్స్, పీనట్ ఎలర్జీ ఉన్నవారు మెంతులు, మెంతి కూర తీసుకోకూడదు. అలాగే, ఇవి ప్రెగ్నెన్సీ టైం లో తీసుకోడం మంచిది కాదు.

 

 

 

గుడ్లు టేస్టీ గా ఉంటాయి.అలాగే పోషకపదార్ధాలు కూడా ఎక్కువగా ఉంటాయి గుడ్డులో.  వీటిలో ప్రొటీన్, విటమిన్ బీ12, విటమిన్ డీ, రైబోఫ్లావిన్, ఫోలేట్, కోలీన్ ఉంటాయి. కోలీన్ చిన్న పిల్లల్లో మెదడు పెరుగుదలకు  బాగా హెల్ప్ చేస్తుంది. వీటిని బాయిల్ చేసి తీసుకోవచ్చు, స్క్రాంబుల్ చెయ్యచ్చు, ఆమ్లెట్, సలాడ్...ఎలాగైనా తినచ్చు.ప్రెగ్నెన్సీ టైం లో బిడ్డకి పాలిస్తున్నప్పుడూ కూడా తల్లికి విటమిన్ ఏ ఫుడ్స్ చాలా అవసరం. క్యారెట్స్ లో ఉన్న బీటా కెరొటిన్ వల్ల విటమిన్ ఏ లోపం లేకుండా ఉంటుంది. క్యారెట్ సూప్, క్యారెట్ సలాడ్ , లేదా క్యారెట్ జ్యూస్, క్యారెట్ కూర...అన్నీ మంచివే. ఎలాగైనా తీసుకోవచ్చు.

 

 

 

పాలకూరతో పాటూ మిగిలిన ఆకుకూరలు కూడా బాలింతలకి చాలా మంచిది. పాలకూర సిజేరియన్ ద్వారా బిడ్డని కన్న వారికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, బాలింతలు మాత్రం వండిన పాలకూరనే తినాలి. ప్రెగ్నెన్సీ టైమ్‌లో పెరిగిన బరువుని పోగొట్టుకోవడం వంటి ప్రయోజనాలు పాలిచ్చే తల్లులకి ఉంటాయి. పైగా వీరికి బ్రెస్ట్ కాన్సర్, ఆర్థ్రైటిస్, గుండె జబ్బులు వచ్చే రిస్క్ కూడా బాగా తగ్గుతుంది. అంతే కాకుండా బిడ్డకి పాలివ్వడం వల్ల తల్లికీ బిడ్డకీ మధ్య ఒక చక్కని మానసిక బంధం ఏర్పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: