ఆడవారు ఎక్కువగా గోరింటాకును ఇష్టపడతారు.ఐతే గోరింటాకు ఎక్కువగా ఆషాడ మాసం లోనే ఎందుకు పెట్టుకుంటారు అనే విషయం మిలో ఎంతమందికి తెలుసు.దాన్ని వెనుక రహస్యం ఏంటో చూద్దాం.. గోరింటాకు పెట్టుకోడం వలన మనకు కలిగే ఆరోగ్య రహస్యాలు చాలానే ఉన్నాయి మరి ఇప్పుడు వస్తున్న మార్కెట్లలో లభించే మెహందికి ప్రకృతి పరంగా చెట్టు నుండి కోసే గోరింటాకును చాల తేడాలున్నాయి శుభకార్యాలకు మెహేంది ఫంక్షన్  అంటూ కెమికల్ వాడేబదులు చక్కడ చెట్టు నుండి ఆకును కోసి రుబ్బి పెట్టుకుంటే చాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

 

 

 మన వాతావరణం ప్రకారం ఆషాడంలో వర్షాలు పడుతుంటాయి. దీంతో వతావరణం అంతా చల్లగా మారుతుంది. అంతేనా, సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపిస్తాయి. అయితే, వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ, ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు. దీంతో సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది.గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతారు.

 

 

 అందుకే అంటారు ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. అందుకే అమ్మాయిలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు. ఇప్పుడంటే గోరింటాకు పెట్టుకోవడం ఆడవారు మాత్రమే చేస్తారని చెబుతున్నారు కానీ, ఇదివరకైతే మగవారు కూడా పెట్టుకునేవారట.ఇక ఆడవారు గోరింటాకు పెట్టుకోవడానికి మరో ముఖ్య కారణం ఏంటంటే.. ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్, సర్ఫులను వాడుతారు. ఈ సమయంలో వారి గోళ్లలో నీరు ఎక్కువగా చేరి సమమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ దూరం అవుతాయని అంటారు.

 

 

 

ఇక గోరింటాకు ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి . అందులో నిమ్మరసం కలపాలి. వీటితో పాటు గోరింటాకు రుబ్బేటప్పుడు రవ్వంత చింతపండు వేసినా మంచి ఉపయోగం ఉంటుంది. అదే విధంగా గోరింటాకును పెట్టుకున్నాక.. అది పూర్తిగా చేతిపై ఎండిపోయి రాలిపోయే స్థితిలోకి వచ్చాక తీసేయాలి.. అలా తీసేసిన వెంటనే చేతులని శుభ్రం చేసుకోవద్దు.. కనీసం ఓ అరగంట అయినా ఉంచాలి. ఆ తర్వాత చేతులని శుభ్రం చేసుకోవాలి.  మరి గోరింటాకు పెట్టుకోడం వలన ప్రధానంగా పిప్పి గోర్లు ఉన్నవాళ్ళకి తగ్గిపోతాయి అలాగే గోరు చుట్లు లాంటివి రాకుండా కాపాడుతుంది ఆషాడ మాసంలో రక రకాల వైరస్ లు విజృంభించే అవకాశం ఉటుంది వాటి నుండి కాపాడడం లో గోరింటాకు కూడా సహాయ పడుతుంది అలాగే గోరింటాకును జుట్టుకి కూడా పట్టించు కుంటారు కొంత మంది దీనివలన జుట్టుకి కూడా ఒత్తుగా పెరుగుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: