ఇప్పటి పరిస్థితులలో ఆడవాళ్ళకి  రక్షణ అనేది చాలా ముఖ్యం. బయటకు ఒంటరిగా వెళ్లాలంటే భయపడిపోతున్నారు. అయితే ఆడవాళ్లు వాళ్ళకి వాళ్ళు ఆత్మరక్షణ అనేది చేసుకోవాలి.కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిచడం వల్ల కొన్ని ఇబ్బందుల నుండి రక్షింపపడతారు. అవేంటో చూద్దాం.. ఆడవాళ్లకు  క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు  ఆ సమయంలో ఎలా స్పందించాలో మరియు ఏమి చేయాలో తెలియదు. ఇటువంటి పరిస్థితులను చాలాసార్లు మీరు ఒంటరిగా ఎదుర్కొవాల్సి ఉంటుంది. కనుక ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే స్పందించి తగిన నిర్ణయం తీసుకొంటే వీటి నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది.మన జీవితంలో ఎటువంటి కఠినమైన మరియు క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొనడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. దేనికి భయపడకూడదు.

 

 

 

మీరు ఎలివేటర్ లో వెళ్తున్నప్పుడు ఎదుటి వ్యక్తిని గమనిస్తే అతను ప్రమాదకరమైన వ్యక్తిగా అనిపిస్తే ప్రతి ఫ్లోర్ కోసం బటన్ ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి నుంచి తప్పించుకోవడానికి ఎవరినైనా సహాయం అడగడానికి అవకాశం ఉంటుంది.అలాగే ఆడవాళ్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అలసట వల్ల కళ్ళు మసకమసకగా కనబడుతూ ఎదురుగా ఏమీ ఉన్నవి సరిగ్గా కనిపించవు. ఇటువంటప్పుడు కర్పూరం పొడి లేదా నూనె వాసనను పీల్చడం వల్ల స్పృహతో ఉండి డ్రైవింగ్ పైన మరింత శ్రద్ధ వహించేందుకు అవకాశం ఉంటుంది.ఆడవాళ్ళు ఎప్పుడూ తమ బ్యాగులో హెచ్ఐవి పాజిటివ్ అని ఓ కాగితాన్ని తమ వద్ద ఉంచుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీ పైన ఎవరైనా బలాత్కారం చేయడానికి వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. ఆ వ్యక్తి మీ బ్యాగులో ఉన్న ఆ కాగితాన్ని చూసి వెంటనే భయపడి ఈ వ్యాధి నాకు కుడా వస్తుందనే భయంతో మిమ్మల్ని తాకేందుకు ప్రయత్నించడు.

 

 

 

అలాగే ఆడవాళ్లు ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్ లో పెప్పర్ స్ప్రే ఉంచుకోవాలి. జడ వేసుకునేటపుడు పక్క పిన్స్ పెట్టుకుంటే మంచిది. ఏదన్నా కష్ట సమయంలో పిన్ ఉపయోగించి ఎదుట వ్యక్తికి హాని తలపెడితే మిమ్మల్ని వదిలే ఛాన్స్ ఉంది.. అలాగే మీ సెల్ ఫోన్లో లొకేషన్, GPRS ఎప్పుడు ఆన్లో ఉంచుకోండి.ఏదన్నా ఆపద సమయంలో పోలీసులకు మెసేజ్ ఇవ్వవచ్చు.అలాగే ఏదన్నా ఆటోగాని,కార్ గాని ఎక్కినపుడు ముందుగా ఆటో నంబర్ నోట్ చేసుకుని, డ్రైవర్ యొక్క ఫోన్లో నెంబర్ కూడా తీసుకుని మీ ఫ్రెండ్స్ కి గాని,అమ్మ నాన్నలకు గాని మెసేజ్ ఇవ్వండి. అలాగే ఎవరో తెలియని వ్యక్తులు ఏదన్నా తినమని గాని, తాగమని గాని ఇస్తే అసలు తాగవద్దు.అందులో మత్తుమందు కలిపి మిమ్మల్ని ట్రాప్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల ఎదుటి వ్యక్తి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. 

.

మరింత సమాచారం తెలుసుకోండి: