అమ్మా అని పిలిపించుకోవాలని ప్రతి మహిళ ఎదురుచూస్తుంది. ఎప్పుడు నెల తప్పుతాన, కడుపులో బిడ్డ ఎప్పుడు పెరుగుతుందో అనే ఆలోచనతో ఉంటారు ఆడవాళ్లు.అయితే ఇటీవల మహిళల్లో ఇన్ఫెర్టిలిటీ సమస్య పెరిగింది. కాబట్టి  మానసికంగా, శారీరకంగా ప్రెగ్నెన్సీకి ముందు మహిళలు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ప్రెగ్నెన్సీ బాధ్యతకు సిద్ధంగా ఉండాలి. అందుకే ప్రెగ్నన్సీకి ముందు మహిళలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూద్దాం.ప్రెగ్నెన్సీకి ముందు కపుల్స్ ముందుగా డాక్టర్ ని సంప్రదించాలి. తమ హెల్త్ కండీషన్ ఎలా ఉంది.. ఎలాంటి మార్పులు అవసరమని తెలుసుకోవడం చాలా అవసరం.

 

 

 

 

అలాగే అన్ హెల్తీ ఫుడ్ లో ఎక్కువ ఫ్యాట్, షుగర్ ఉంటాయి. ఇవి ఇన్ఫెర్టిలిటీ ఛాన్సెస్ పెంచుతాయి. అందుకనే పోషకాహారం తినడానికి ప్రయత్నించాలి. కెమికల్స్ లేని ఆర్గానిక్ ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేయాలి. బేబీ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ప్రొబయోటిక్ ఫుడ్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. వాటితో పాటు వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి.ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ని ఎక్కువగా తీసుకోవాలి . కొన్ని రకాల యోగా భంగిమలు హెల్తీ ప్రెగ్నన్సీకి సహాయపడతాయి.  దీనివల్ల ఫెర్టిలిటీ రేట్ మెరుగుపడుతుంది.ఒత్తిడి అనేది ఇన్ఫెర్టిలిటీకి ముఖ్య కారణం. అబార్షన్లకు కూడా ఒత్తిడి కారణమవుతుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఒత్తిడి లేకుండా గడపండి.

 

 

 

దీనికోసం ధ్యానం చేస్తూ ఉండాలి.మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఫెర్టిలిటీకి అవసరమయ్యే హార్మోన్స్ సెక్స్ కారణంగా రిలీజ్ అవుతాయి. కాబట్టి సెక్స్ లో పాల్గొనడం మరిచిపోకండి. కన్సీవ్ అవడానికి ఇది మొదటి స్టెప్.కన్సీవ్ అవడానికి ముందు అధిక బరువు, తక్కువ బరువు రెండూ ప్రాబ్లమే.అందుకే  మీ హైట్ కి తగ్గట్టు ఎంత వెయిట్ ఉండాలో ఒకసారి డాక్టర్ ని సంప్రదించి తెలుసుకుని  అదే బరువు మెయింటేన్ చేయడం చాలా అవసరం.ఒకవేళ మీరు ఉండాల్సినంత బరువే ఉన్నప్పటికీ.. ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి.ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీ సమయంలో కాఫీ చాలా సీరియస్ ఎఫెక్ట్ తీసుకొస్తుంది.అవసరాన్ని మించి కాఫీ వినియోగం ఎక్కువగా ఉండకూడదు. ప్రెగ్నెన్సీకి ముందు స్మోకింగ్, డ్రింకింగ్ చేసే ఆడవాళ్లకు కన్సీవ్ అవడానికి  తక్కువ ఛాన్స్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: