అందమైన ముఖం కావాలని  ప్రతి స్త్రీ కోరుకుంటుంది. అయితే ఇప్పుడున్న  కాలంలో చాలామంది ఆడవాళ్లు  అవాంచిత రోమాలతో బాధపడుతున్నారు. అది అందమైన ముఖాన్ని అందవిహీనంగా చేస్తుంది. వాటిని చూసుకున్నప్పుడల్లా స్త్రీ లు ఎంతో బాధని అనుభవిస్తుంటారు. ఈ అవాంచిత రోమాలు అనేది ఒక దీర్ఘకాలిక సమస్య. దీనికి మీరు వాక్సింగ్, షేవింగ్ మరియు ఇతర చికిత్సలు చేయించటం వల్ల క్రమంగా మరింత పెరుగుతాయి తప్ప తగ్గవు. దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఏమి లేదు, కానీ కొన్ని సహజ నివారణలు ఉన్నాయి.కొన్ని రకాల ఇంట్లో ఉండే ఔషదాల ద్వారా ముఖ చర్మంపై ఉండే అవాంఛిత రోమాలను పూర్తిగా తొలగించుకోవచ్చు.

 

 


 శనగ పిండికి నీరు లేదా పాలను కలిపి మందమైన పేస్ట్ లా తయారు చేయండి. ఈ మిశ్రమానికి ¼ పసుపు పొడి మరియు తాజా క్రీమ్ ను కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి. అవాంఛిత రోమాలు గల ప్రదేశంలో నేరుగా ఈ పేస్ట్ ను అప్లై చేయండి. 20 నుండి 25 నిమిషాలలో ఎండిపోయి, పొడిగా మారుతుంది. ఈ పేస్ట్ ను చేతివేళ్ళ సహాయంతో, ప్రభావిత ప్రాంతాలలో రాయండి.పసుపు  మనం ప్రతి రోజు మన వంటల్లో వాడేదే.. పసుపు లో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు అవాంఛిత రోమాలును తొలగించి ముఖంలో తేజస్సుని, మరియు అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. దీన్ని ఆయుర్వేదం లో ఒక మెడిసిన్ లా ఉపయోగిస్తారు. పసుపుని శెనగపిండి తో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి, పసుపు రోమాలను తొలగించటమే కాకుండా వాటి పెరుగుదలను కూడా అదుపులో ఉంచుతుంది.

 


చక్కెర, నిమ్మరసం మరియు నీటిని కలిపి చిక్కని పేస్ట్ లా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని చేతి వేళ్ళ సహాయంతో వెంట్రుకల పెరుగుదలకు వ్యతిరేఖంగా అప్లై చేయండి. 15 నుండి 20 నిమిషాల పాటు అలానే ఉంచటం వలన ఇది పొడిగా మారుతుంది. తరువాత చల్లటి నీటితో తొలగించండి. నిమ్మ మరియు చక్కెరలు కలిపిన మిశ్రమం నుదుట మరియు బుగ్గలపై ఉండే అవాంఛిత రోమాలను తొలగిస్తుంది. ఈ రకానికి చెందిన ఫేస్ మాస్క్ ను వారంలో రెండు సార్లు ముఖానికి అప్లై చేయవచ్చు.
శనగపిండి, నిమ్మరసం మరియు నీరు కలిపిన మిశ్రమం అవాంఛిత చర్మాలను తొలగించుటలో శక్తివంతంగా తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: