తల్లి కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. అయితే  హాస్పిటల్ కి వెళ్లకముందే కొన్ని లక్షణాలతో ఇంట్లోనే ప్రెగ్నన్సీ కన్ఫర్మ్ చేసుకోవచ్చు.ఎలాంటి ప‌రీక్ష చేయ‌కుండానే మ‌హిళ‌లు త‌మ‌కు గ‌ర్భం వ‌చ్చిందో, రాలేదో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. అందుకు వారి శ‌రీరంలో క‌నిపించే కొన్ని ల‌క్ష‌ణాలే కార‌ణం. ఈ క్ర‌మంలో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే గ‌ర్భం వ‌చ్చింద‌ని చెప్ప‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

 

వారివక్షోజాలు మృదువుగా, ఉబ్బిన‌ట్టు మారుతాయి. నిపుల్స్ చుట్టూ ఉన్న ప్ర‌దేశం వెడ‌ల్పుగా, న‌ల్ల‌గా మారుతుంది. ఇలా అవుతుందంటే ఆ మ‌హిళ‌ల‌కు ప్రెగ్నెన్సీ వ‌చ్చిన‌ట్టే లెక్క‌. బిడ్డ‌కు పాలివ్వ‌డం కోసం వ‌క్షోజాలు అలా మార్పు పొందుతాయి. అందుకే అలాంటి మార్పు కనిపిస్తుంది. దాన్ని బ‌ట్టే ప్రెగ్నెన్సీ వ‌చ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు.గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌లు త‌ర‌చూ మూత్రానికి వెళ్లాల్సి వ‌స్తుంది. ఎందుకంటే పిండం ఏర్ప‌డుతుండ‌డం వ‌ల్ల గ‌ర్భాశ‌యం మూత్రాశ‌యంపై ఒత్తిడి క‌లిగిస్తుంది. అందుకే త‌ర‌చూ మూత్రం వస్తుంది. ఈ ల‌క్షణం క‌నిపించినా మ‌హిళ‌లు గ‌ర్భం దాల్చినట్టే లెక్క‌.

 

 

అయితే షుగ‌ర్ స‌మ‌స్య ఉన్నా అలా త‌ర‌చూ మూత్రానికి వెళ్లాల్సి రావ‌చ్చు. అందుక‌ని ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తే చెక‌ప్ చేయించుకోవ‌డం బెట‌ర్.మ‌హిళ‌లు గ‌ర్భం దాలిస్తే వెంట వెంట‌నే అల‌సిపోతుంటారు. ఎందుకంటే వారిలో ఉండే శ‌క్తి న‌శిస్తుంది. అందుకు కార‌ణం ఎదుగుతున్న పిండ‌మే. దానికి త‌గినట్టుగా ఆహారం తీసుకుంటే ఈ స‌మ‌స్య రాదు. ఈ ల‌క్ష‌ణం ఉందంటే గ‌ర్భం దాల్చిన‌ట్టే.  అందుకని గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌ల‌కు బాగా ఆక‌లి వేస్తుంది.

 

అలాగే గర్భం దాల్చిన మహిళలకు రుతుక్రమం రాదు. కానీ రుతుక్రమం వచ్చినట్టుగా కడుపు నొప్పి వస్తుంది. అందుకు కారణం పిండం గర్భాశయ గోడలకు అతుక్కుంటూ ఉండడమే. అలా అవుతున్న పక్షంలో కడుపు నొప్పి వస్తుంది.ఇది కూడా ప్రెగ్నెన్సీ లో ఒక లక్షణం. ప్రెగ్నెంట్ అయిన మహిళల కడుపు నుంచి జననావయవాల వరకు ఒక పొడవాటి నల్లని రేఖ ఏర్పడుతుంది.గర్భం దాల్చిన మహిళలకు నాలుక అంతా లోహపూరితమైనట్టు అనిపిస్తుంది. అప్పుడు రుచి సరిగ్గా తెలియదు. అయితే ఈ స్థితి కొన్ని రోజులే ఉంటుందట.గర్బం దాల్చిన మహిళలకు ఉదయాన్నే వికారంగా ఉంటుంది. వాంతులవుతాయి. ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ వల్ల కూడా అలా జరిగేందుకు అవకాశం ఉంటుంది. బాగా వాంతులు అవుతున్న పుల్లటి పదార్ధాలు తినాలన్న కోరిక ఉన్న గాని కడుపుతో ఉన్నట్లు అర్ధం చేసుకోవాలి. పై లక్షణాలు కనుక ఉంటే వైద్యున్ని సంప్రదిస్తే ప్రెగ్నెంట్ అవునో కాదో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: