ఆడవాళ్లు  ఎప్పటికి యవ్వనంగా ఉండాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి. కొంతమంది మహిళల్లో చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు వచ్చినట్లు కనిపిస్తాయి. అందుకనే ఇలాంటి కొన్ని టిప్స్ పాటిస్తే  వృద్ధాప్య ఛాయలు కనపడవు. వృద్ధాప్య లక్షణాలు అంటే  మొదట చర్మం ముడతలు, జుట్టు తెల్లబడడం, కళ్ళ కింద చారలు రావడం గమనించవచ్చు. చర్మానికి తగిన స్థాయిలో తేమని సమకూర్చటం వలన యవ్వనంగా కనపడేలా చేస్తుంది. ఇది చర్మం పైన ఉండే  మలినాలను తోలగించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మీ చర్మం ఎక్కువ ఆయిల్ ని కలిగి ఉన్నట్లయితే, ఆయిల్ ని తోలగించి తేమని అందించే వాటిని వాడండి. మీరు వాడే ఉత్పత్తులు తేమని కలిగించి, ఇబ్బందులకు గురి చేస్తుంటే అయితే మీరు వేరే ఉత్పత్తులను వాడి చూడండి.

 

 

 

చర్మానికి ఎక్కువ పౌడర్లను పూయటం అంత మంచిది కాదు, వీటి వలన చర్మ కణాల మద్య ఉండే గీతల మధ్యలో పౌడర్ ఇరుక్కుపోతుంది. మీ చర్మం మృదువుగా కనపడాలి అనుకుంటే వీటిని వాడకూడదు. చర్మం నుండి పౌడర్ మరియు దుమ్ము, ధూళిలను వేరు చేయటానికి కాటన్ లేదా పత్తిని వాడటం చాలా మంచిది.నడిచేటపుడు సూర్య కాంతికి దూరంగా ఉండండి, దీని వలన చర్మ కణాలు దెబ్బతినడం, కాన్సర్ రావటం, లేదా చర్మం పైన ముడతలు వచ్చే అవకాశం ఉంది. కావున వీలైనంతగా సూర్యరశ్మికి దూరంగా ఉండండి. సూర్య కాంతిలో వెళ్ళటానికి ముందుగా, సూర్య రశ్మికి బహిర్గతమయ్యే ప్రదేశాలలో సన్ స్క్రీన్ లేదా గోడుగుని వాడండి.

 

 


శరీరంలో అన్ని అవయవాలు, వాటి విధులను నిర్వర్తించటానికి నీరు తప్పక అవసరం. రోజుకు 10 గ్లాసుల నీటిని తాగటం వలన చర్మం ఉపరితలం పైన ఉండే నిర్జీవ కణాలు, ఆరోగ్య వంతమైన కణాలతో మార్చబడి మీరు యవ్వనంగా కనబడతారు.వృద్దాప్యం వచ్చిందా, అని చూసేపుడు ముందుగా కంటి కింద మరియు కంటి చుట్టూ ఉన్న చర్మాన్ని పరిక్షించి చూడాలి. ఈ భాగంలో వృద్దాప్యంపై బడే లక్షణాలు ప్రారంభమవుతాయి. మీరు యవ్వనంగా కనపడటానికి ఈ ప్రాంతంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.యవ్వనంగా ఉన్న, బలహీనంగా లేదా అనారోగ్యంగా ఉన్నా, మీరు వయసులో పెద్ద వారిలా కనిపిస్తారు. జుట్టు తెల్లబడిన వెంటనే కలర్ లేదా దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహరం తినండి మరియు రోజు రాత్రి పడుకోటానికి ముందుగా తలని, జుట్టును నూనెలతో మసాజ్ చేయండి.ఎక్కువ ఒత్తిడికి లోనుకాకండి..

మరింత సమాచారం తెలుసుకోండి: