ఒక బిడ్డకి జన్మ ఇవ్వడం అంటే అంత కన్నా సంతోషించే విషయం ఇంకోటి ఉండదు. అయితే తల్లికి  పుట్టబోయే శిశువును ఎలా రక్షించుకోవాలి అనే విషయంపై అవగాహన కలిగివుండాలి.అందుకనే ప్రారంభ దశలో ఎలాంటి మెడికల్ టెస్ట్‌లు, వాక్సిన్లు వేయించుకోవాలి, ఏ డాక్టర్‌ను సంప్రదించాలి మొదలగు విషయాలు కూడా తెలియాలి. వారికి పుట్టబోయే శిశువు గురించి తల్లులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, బిడ్డ కడుపులో ఉన్నప్పుడు చేయాల్సిన వ్యాయామాలు, మెడిటేషన్ తరగతులకు హాజరవడం, మంచి తల్లిగా ఎలా ఉండాలి.. ఇలాంటి విషయాలన్నింటి గురించి అవగాహన కలిగివుండాలి. 

 

 

వేసుకోవాల్సిన టీకాలు గురించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి - ప్రెగ్నెన్సీ సమయంలోను, డెలివరీ అయిన తరువాత, శిశువు కోసం ఒకటి, తల్లి కోసం ఒకటి! ఇలా వైద్యులు సూచించే చాలా సలహాలను పాటించాలి, వీటిలో ప్రతి విషయాన్నీ తప్పనిసరిగా పాటించాలి.ప్రెగ్నెన్సీ సమయంలో టీకాలు వేసుకోవడం చాలా తక్కువ. టీకాలు గురించి ఎక్కువమందికి తెలియకపోవడం దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు. మహిళలలో ఈ టీకాల గురించి మరియు వాటి భద్రత గురించి పూర్తి అవగాహన లేకపోవడం వలన కూడా వాక్సినేషన్ రేట్ తక్కువగా ఉంది. ప్రెగ్నెన్సీ లేనివారితో పోలిస్తే ప్రెగ్నెన్సీ ఉన్న మహిళల్లో  అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువనే విషయం తెలిసిందే. 

 

 

 

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల్లో వచ్చే శారీరక మార్పుల వలన కూడా ఈ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. తను మరియు తనకి పుట్టబోయే బిడ్డ ఇద్దరి ఆరోగ్యం గురించి కూడా ప్రెగ్నెంట్ మహిళ ఆలోచించాలి. పుట్టిన బిడ్డకు ఆరు నెలలు వచ్చేంత వరకు కూడా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభంలో, పుట్టిన బిడ్డ తన వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుచుకోవడానికి మరియు న్యూట్రిషన్ కోసం తల్లి పాల మీద ఆధారపడుతుందిఇలా భారతదేశంలో, చాలా ముఖ్యమైన ఇన్ఫ్లుఎంజా వాక్సిన్‌ను ఎక్కువగా పట్టించుకోరు. అందువలన ప్రెగ్నెంట్ మహిళలు ఫ్లూను ఎదుర్కోవడానికి డాక్టర్‌ను సంప్రదించి వాక్సిన్ తీసుకోవడం మంచిది. మీరు ఇన్ఫ్లుఎంజా వాక్సిన్ వేసుకోకుండా ఈమధ్యనే బిడ్డకు జన్మనిచ్చినట్లయితే, ఇప్పుడే  ఇన్ఫ్లుఎంజా  వైరస్ తీసుకొని తల్లి పాల ద్వారా బిడ్డకు అవసరమయ్యే యాంటీబాడీస్‌ను ఇవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి: