కడుపులో బిడ్డని మోయడం అనేది స్త్రీ కి ఒక గొప్ప అనుభూతి. అలాగే బిడ్డని కనే దాక అన్నో అనుమానాలు గర్భిణీని చుట్టుముడతాయి.  కుటుంబసభ్యులు, ఇంట్లో ఉండే పెద్దవారు చాలావరకు ఆ అనుమానాలు తీర్చగలిగినా అందరి దృష్టి తొమ్మిది నెలలు నిండాక అయ్యే ప్రసవం మీదే ఉంటుంది. . డాక్టర్ని కలిసినప్పుడల్లా ‘డెలివరీ ఎలా అవుతుంది అనే ప్రశ్న అడుగుతూనే ఉంటారు. నార్మల్ డెలివరీ అవుతుందా !లేక సిసేరియన్  డెలివరీ అవుతుందా అన్న ఆలోచన ఉంటుంది. కానీ ఇప్పటి పరిస్థితులలో చాలా మంది గర్భిణీ స్త్రీలకు  ఆపరేషన్ చేసి బిడ్డను తీసుతున్నారు తప్ప నార్మల్ డెలివరీ చేయడం లేదు.

 

 

పెల్విస్ లేదా స్పైనల్‌కార్డ్‌లో లోపాలు, గర్భసంచికి పూర్వం జరిగిన ఆపరేషన్, ఇన్ఫెక్షన్ సోకడం, కుట్లు బలహీనంగా ఉండటం, బిడ్డ ఎదురు కాళ్లతో ఉండటం, మాయ కిందకు ఉండటం, వెజైనాలో ఇన్ఫెక్షన్లు ఉండటం... వంటివి ఆపరేషన్‌కి కొన్ని కారణాలు. అయితే చాలా మంది స్త్రీలు సిజేరియన్ కంటే నార్మల్ డెలవరీనే ఎక్కువగా కోరుకుంటారు. నార్మల్ డెలివరీ కోరుకొనే వారు గర్భందాల్చినప్పటి నుండి సరైన జాగ్రత్తలు, డైట్, ప్రెగ్నెన్సీ వ్యాయామం, తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల నార్మల్ డెలివరీ సాధ్యం అవుతుంది. మొదటిసారి గర్భం ధరించే స్త్రీలకు డాక్టర్స్ ఖచ్చితంగా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్స్ ను తీసుకోమని సలహాలిస్తుంటారు.

 

 

గర్భణీలు, గర్భధారణ సమయంలో అదనపు బరువు పెరగకుండా, నార్మల్ డెలివరీ జరగనివ్వకుండా చేసే కొన్నిరకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. గర్భిణీలు నార్మల్ డెలివరీ గురించి తెలుసుకోవాలి నేచురల్ మరియు సైకలాజికల్ ప్రొసెస్ అని, ప్రతి ఒక్క స్త్రీ జీవితంలో ఇది సహజం అని తెలుసుకోవాలి. అంతేగాని ఎలాంటి ఒత్తిడికి లోనుకాకూడదు. అలా కాకుండా, పరిస్థితి విషమించినప్పుడు మాత్రమే సిజేరియన్ కు సిద్దపడతారు లేదంటే నార్మల్ డెలివరీ సాద్యమే...మీరు గర్భం ధరించారని నిర్దారించగానే, మొదట మీరు చేయవల్సిన ముఖ్యమైన పని, హెల్తీ డైట్ ను పాటించడమే. అందులో ముఖ్యంగా జింక్ మరియు క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలు గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం.నార్మల్ డెలివరీ కోరుకొనే వారు హెల్తీ డైట్ తో పాటు మరో ముఖ్యమైన ప్రెగ్నెన్సీ చిట్కా ప్రశాంతమైన నడక. ప్రతి రోజూ అరగంట నడవడం వల్ల, సిజేరియన్ కు అవకాశం ఉండదు. మరికొన్ని టిప్స్ తదుపరి ఆర్టికల్లో చూద్దాం.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: