అందం విషయంలో చర్మానిది ప్రధాన పాత్ర. అయితే  కొందరిలో  చర్మం మీద మచ్చలు, మెుటిమల కారణంగా వారి అందం మసక బారుతుంది . వీటికి తోడు బ్లాక్‌హెడ్స్‌ తోడైతే మొటిమలకు దారితీసి ముఖం నల్లగా మారుతుంది.ముఖంపై నల్లటి పొక్కులు ఏర్పడటాన్నే బ్లాక్ హెడ్స్ అంటారు. చర్మ రంధ్రాలు పూడుకుపోవడంతో పాటు… సెబాసియస్ అనే గ్రంథి సెబమ్ అనే ఒక రకమైన తైలాన్ని ఎక్కువగా స్రవిస్తుంది. అందువల్లే ముఖంపై బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి.బ్లాక్‌ హెడ్స్‌ బెడద వదిలించుకొనే  కొన్ని చిట్కాలు గూర్చి తెలుసుకుందాం.. 

 

 


తరచూ నిమ్మరసం, బాదం నూనె, గ్లిసరిన్‌ను సమపాళ్ళలో కలిపి ముఖానికి పట్టించుకుంటే బ్లాక్‌హెడ్స్‌ తగ్గటమే గాక ఇతర మచ్చలూ తొలగిపోతాయి.రోజూ  గోరువెచ్చటి నీళ్ళలో టవల్‌ లేదా నాప్కిన్‌ను ముంచి దానిని పావుగంట పాటు ముఖం మీద ఉంచుకోవడం ద్వారా చర్మ రంధ్రాలలో చిక్కుకుపోయిన మురికి, మృతకణాలు వంటివి బయటకు వచ్చేస్తాయి. ఆ నాప్కిన్‌ను వేడి నీటిలో ఉతికి ఆరేసి మళ్ళీ వాడుకోవచ్చు. బ్లాక్‌హెడ్స్‌ ఉన్న చోట గోరు వెచ్చని తేనె రాసి 10 నిమిషాల తర్వాత కడిగితే సమస్య తగ్గు ముఖం పడుతుంది.అలాగే రెండు కోడి గుడ్ల ను తీసుకుని అందులో నుండి తెల్ల సొనను వేరుచేయాలి. ఆ తెల్ల సొనలో ఒక టీ స్పూను తేనె కలిపి బాగా గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట ఆగి కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేయాలి.

 

 

 

ఎప్పటికప్పుడు చర్మం మీది మృత కణాలను తొలగిస్తే బ్లాక్‌హెడ్స్‌ సమస్య చాలా వరకూ తీరిపోతుంది.రోజూ మేకప్ వేసుకునే వారు మరీ ఎక్కువగా ఉండే కాస్మోటిక్స్ వాడటం వల్ల ఆయా కాస్మోటిక్స్ అవశేషాలు ముఖ చర్మంలో ఉండే రంద్రాలలో చేరి మొటిమలకు కారణమవుతాయి. అందుకే వీరు తమ చర్మ స్వభావానికి అనుకూలమైన సౌందర్య సాధనాలను ఎంపిక చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: