చాలా మంది మహిళలు తమకు స్తన సౌందర్యం అంతంత మాత్రంగా ఉందని లోలోన మథనపడిపోతుంటారు. దీంతో స్తన సౌందర్యాన్ని మెరుగు కోసం ప్లాస్టిక్‌ సర్జీల వైపు మొగ్గు చూపుతుంటారు. కానీ, వైద్యులు మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని హితవు పలుకుతున్నారు. పౌష్టికాహార లోపం వల్ల, పోషణ సరిగా లేకపోవడం వల్ల శరీరానికి కావల్సిన విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర ఖనిజాలు తగు మోతాదులో అందకపోవడం వల్ల, హార్మోన్ల సమతుల్యం లోపించడం వల్ల, మానసిక ఒత్తిడి వల్ల కూడా స్తనాలు చిన్నగా సన్నగా ఉంటాయని వైద్యులు చెబుతుంటారు.

 

 

 

హార్మోన్ల అసమతుల్యత స్తనాలు చిన్నవవటానికి కారణం. మహిళ శరీరంలో టెస్టోస్టిరోన్ ఉత్పత్తి అధికమైతే అది స్తనాల పెరుగుదల అరికడుతుంది.వ్యాయామ నిపుణులైతే కొన్ని రకాల వ్యాయామాలు చేయడం వల్ల స్తన సౌందర్యం పెంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఇలాంటి వాటిలో కొన్ని వ్యాయామాలను ఇక్కడ పరిశీలిద్దాం. నిటారుగా నిలుచొని రెండు చేతులను ముందుకు వంచి మరల పైకి లేస్తూ  స్థనాల దగ్గరగా వచ్చేలా పదేపదే చేయాలి. ఇలా చేయడం వల్ల స్తనాల వద్ద చర్మం వ్యాకోచం చెంది స్తనాలు మరింత పెద్దవి అవుతాయని సలహా ఇస్తున్నారు.  రోడ్డుపై నడిచే సమయంలో వంగినట్టు కాకుండా, నిటారుగా నడిచేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

 

 

ఇలా చేయడం వల్ల ఉన్న చిన్న సైజు స్తనాలు నిక్కబొడు చుకుని ముందుకు వచ్చినట్టుగా కనిపించడం వల్ల ఎదుటి వారిని ఆకర్షించేలా ఉంటా యంటున్నారు.  దానిమ్మనూనె, మేడి నూనె తీసుకుని స్తనాల కింద నుంచి పైకి గుండ్రంగా మాలిష్‌ చేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు లేదా కనీసం ఒక్కసారి అయినా చేయడం వల్ల స్తనాలకు రక్తపస్రరణ బాగా పెరిగి స్తనాలు బిగుతుగా గుండ్రంగా, అందంగా తయారవుతాయని చెపుతున్నారు.అలాగే వీటితో పాటు కొన్నిరోజుల వరకూ వ్యాయామం చేస్తూ, ‘పుష్ అప్స్’ చేయడం ద్వారా అతి తక్కువ సమయంలోనే బ్రెస్ట్ సైజ్‌ని పెంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: