ఇప్పటికాలం మహిళలకు చాలా మందికి గంజి అంటే ఏంటో తెలియదు.అన్నం వండేటప్పుడు ఎసరులో నీళ్లు ఎక్కువ అయితే ఆ నీటిని ఒక గిన్నెలోకి వంచి పారబోస్తారు. దానినే మనం గంజి అంటాము. నిజం చెప్పాలంటే  ఆ గంజిలోనే అనేక పోషక విలువలు ఉంటాయి  పూర్వం చాల మంది  గంజి తాగి బతికేవారు  అయితే రాను రాను ఈ గంజి వాడకం చాలా తగ్గిపోయింది. అయితే  ఒకప్పుడు గంజిని షాంపూగా కూడా జుట్టుకు  వాడేవారట. ఇలా ఈ గంజిని ఉపయోగించడం వల్ల జుట్టు పట్టులా మెరుస్తుంది.గంజిని తలస్నానం చేసే ముందు జుట్టుకు చేతితో  రాసుకోవాలి. ఒక పావుగంటపాటు అలాగే ఉంచుకోవాలి. తరువాత తలకి స్నానం చేయాలి.ఇలా కనీసం వారానికి మూడు సార్లు అయిన చేస్తే జుట్టు పట్టులా మెరిసిపోతుంది.  గంజిలోని ఇనోసిటోల్‌ అనే కార్బోహైడ్రేట్‌ జుట్టు రాలడాన్ని అరికడుతుంది. పెరిగే కాలుష్యం వల్ల తినే తిండి వల్ల, ఆలోచనలు, ఒత్తిడి కారణంగా జుట్టు ఊడిపోతుంది.

 

 

 

గంజిలోని అమైనో ఆమ్లాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. లావెండర్‌ ఆయిల్‌ని కొద్దిగా గంజిలో కలిపి జుట్టుకు పట్టించి పదినిమిషాల తర్వాత కడిగితే హెయిర్‌ కండీషనర్‌గా ఉపయోగపడుతుంది.అలాగే చర్మంపై దురద వస్తుంటే ఆ ప్రదేశంలో కొద్దిగా గంజి నీటిని పోసి సున్నితంగా మర్దనా చేయాలి. ఫలితంగా దురదలు తగ్గిపోతాయి.చర్మం పాలిపోయినట్లుగా, నల్లబడి ఉంటే గంజిని ఓ గిన్నెలో తీసుకొని కాటన్‌బాల్‌తో చర్మంపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా నల్ల బడ్డ చర్మం కాంతివంతంగా మారుతుంది.

 

 

 

మొటిమల తాలూకూ రంధ్రాలపై కొంచెం గంజిని రాస్తే కొన్ని రోజులకు రంధ్రాలు తొలిగిపోతాయి.గంజి నీళ్లలో కాస్త పసుపు వేసి బాగా కలపాలి. కాటన్‌ బాల్‌తో ముఖంపై తుడిస్తే ముఖంపై మచ్చలు, ముడతలు తొలగిపోయే అవకాశం ఉంది.కనీసం ఒక నెల రోజుల పాటు అయిన పైన చెప్పిన విధంగా చేస్తే ఫలితం ఉంటుంది.గంజి వల్ల శరీరానికి మంచి తేజస్సు వస్తుంది. దీనిలో  పోషక విలువలు ఎక్కువ ఉంటాయి.  ఇది చర్మవ్యాధులకు కూడా చెక్ పెడుతుంది.ఇన్ని ప్రయోజనాలు ఉన్న గంజి నీటిని తాగడానికి ప్రయత్నిచండి. అలాగే అందాన్ని మెరుగు పరచడానికి కూడా ఉపయోగించండి. అందుకనే గంజిని వృథాగా బయట పోయకుండా ఉపయోగించుకోండి.. ఫలితాన్ని చుడండి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: