ఆడవాళ్ళకు  అందమైన ముఖారవిందంతో పాటు, ముఖంలో మెరుపు.. నునుపుదనం ఉంటే ఆ ముఖం మరింత అందంగా కనబడుతుంది. మరి అంత అదంగా కనబడాలంటే ఫేష్ క్లీనింగ్, క్రీమ్ లు అలాంటివి రాస్తే సరిపోదు. వాటితో పాటు రోజు  ముఖాన్ని స్క్రబ్ చేస్తుండాలి. అప్పుడే ముఖం నైస్ గా తయారు అవుతుంది. స్ర్కబ్ కి ఉపయోగించే వస్తువులు ఇంట్లో వాడివి అయితే మరి మంచిది. ఇవి చర్మాన్ని రక్షణ కల్పించడమే కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మన్ని  ఆరోగ్యంగా ఉంచుతాయి. మీరు శరీర సంరక్షణలో ఓట్ మీల్ గురించి వినే ఉంటారు.

 

 

 

 

ఓట్ మీల్ ను తరచూ తీసుకొంటే సన్నబడుతారు, పొట్ట తగ్గించడంలో ఇది ఒక మంచి ఆహారం అని. ఈ ఓట్ మీల్ శరీర సౌష్టవానికి మాత్రమే కాదు... చర్మ సౌందర్యానికి బాగా పనిచేసి ముఖానికి మంచి రంగును... రూపునును అందిస్తుంది. రెండు చెంచాల ఓట్ మీల్ తీసుకొని అందులో ఒక చెంచా తేనె కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ అద్భుతమైన నేచురల్ ఫేస్ స్ర్కబ్ ను ముఖానికి అప్లై చేసి పదిహేను నిముషాల తర్వాత ముఖాన్ని తడిచేసి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ లా రుద్ది చల్లటి నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంద్రాలు తెరచుకొనేలా చేసి, శుభ్రపరచడమే కాకుండా, చర్మం మెరిసేలా చేస్తుంది.

 

 

 

అలాగే మిక్సింగ్ బౌల్ లో కొంత ఓట్ మీల్ తీసుకొని అందులో రెండు చెంచాల నిమ్మరసం కలిపి, కొద్దిసేపు నానబెట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత బాగా స్ర్ర్కబ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసేసుకోవాలి. ఓట్ మీల్ నిమ్మరసం రెండు మిక్స్ చేయడం వల్ల చర్మాని షైనింగ్ వస్తుంది .అలాగే ఓట్ మీల్ -ఆలివ్ ఆయిల్ అద్భుతమైనటువంటి కాంబినేషన్. ఆలివ్ ఆయిల్ వృద్ధాప్య లక్షణాలు పోగొట్టే లక్షణాలు కలిగిటుంటుంది. అలాగే సూర్య రశ్మిని నుండి కాపాడుతుంది. కాబట్టి యవ్వనంతో కూడిన చర్మ సౌందర్యం మీ సొంత కావాలంటే ఈ హోం మేడ్ ఫేషియల్ స్క్రబ్ ను ఉపయోగించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: