అమ్మ  అని పిలిచే మాటలోనే ఉంది ఆప్యాయత, అనురాగం. ఆ పిలుపు కోసం తల్లి ఎన్ని ఇబ్బందులు అయిన ఎదుర్కొంటుంది. బిడ్డను ప్రసవించిన తర్వాత  బిడ్డకు పాలు ఇచ్చే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ప్రసవం తర్వాత కొందరు మహిళలకు రొమ్ము సమస్యలు ఎదురవుతాయి. వీరికి రొమ్ము లో నొప్పులు ఏర్పడతాయి. వారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్యం చేయించుకోవాలి. రొమ్ములలో నొప్పి ఎక్కువగా ఉంటే నొప్పి తగ్గించే మందులను వాడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు రొమ్ము చుట్టూ అల్సర్లు ఏర్పడి నొప్పి రావచ్చు.

 

 

 

 

దీనివల్ల శిశువుకు పాలిచ్చేటప్పుడు నొప్పి కలుగుతుంది. దీంతో కొన్నిసార్లు జ్వరం కూడా వస్తుంది. ఇటువంటివారు రొమ్ము నొప్పి నివారణకు క్రీమ్‌ రాసుకోవాలి.లేదండి ఇంట్లో దొరికే వెన్నపూసను కూడా రాసుకోవచ్చు.  అవసరాన్ని బట్టి, మందులను వాడాల్సి ఉంటుంది. అల్సర్‌లు ఎక్కువ రోజులు ఉంటే క్యాన్సర్‌ పరీక్షలు సైతం చేసుకోవాలి.మ్ము సమస్యల్లో అక్యూట్ మాస్‌టైటిస్‌ ఒకటి. దీని వల్ల ఒళ్లు నొప్పులు, రొమ్ము ఎర్రగా కావడం, ముట్టుకుంటే నొప్పి కలగడం జరుగుతుంది. ఈ సందర్బంగా ఏర్పడే చనుమొన పగుళ్ళు సమస్యలు ఉంటే వెంటనే గైనకాలజిస్ట్‌ల చేత వైద్యం చేయించుకోవాలి.కొందరు మహిళలకు రొమ్ము లో పాలు గడ్డ కట్టడం సంభవిస్తుంది.

 

 

 

 

ఇటువంటి వారు ఎక్కువయిన పాలను ఎప్పటి కప్పుడు తీసేయాలి. కొందరు రొమ్ము సమస్యల వల్ల పాలు తక్కు వగా వస్తాయి. ఎక్కువ జ్వరం ఉంటుంది. రక్తపోటు ఉన్నవాళ్లు, రక్తం తక్కువగా ఉన్నవాళ్లు, ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు, డిప్రెషన్‌తో బాధపడుతున్నవాళ్లకి రొమ్ము సమస్యలు ఏర్పడతాయి.పాలు రానివారికి, తక్కువగా వస్తున్నవారికి ఓదార్పు చెప్తూ శిశువును ఎల్లప్పుడు తల్లి పక్కనే ఉంచడం మంచిది. వీరికి సరైన పోషకాహారం, విశ్రాంతి అవసరమన్న విషయం గమనించాలి. పాలు ఎక్కువ రావడానికి మంచిది పోషకాలతో కూడిన ఆహారం తినాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: