బాలింతలు పిలల్లకు పాలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు పాల ద్వారానే ఆహారం అనేది అందుతుంది. అందుకనే పిల్లలకు పాలిచ్చేటప్పుడు ముందుగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి అలాగే రొమ్మును శుభ్రమైన పొడి బట్టతో తుడుచుకోవాలి .చనుమొనులు  కఠినంగా,ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా సున్నితంగా చనుమొన శుభ్రం చేయాలి.
ఒకవేళ చను మొన చదునుగా లేదా లోపలికి ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించాలి.ప్రతిసారి పిల్లలకు పాలు ఇచ్చినప్పుడల్లా కొన్ని చుక్కల పాలు చనుమొన మీద పూసి ఆరనివ్వాలి.

 

 

 

ఇలా చేయడం వలన చనుమొన పొడి బారనియ్యకుండ, ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా రక్షణగా ఉంటుంది ఒకవేళ చనుమొన నొప్పిగా, గాయలుగా అనిపించిన శుద్ధిచేసిన లేనోలిన్ ద్రవాన్ని దూదితో పూతలాగా పూయాలి.ఒకవేళ చనుమొన సమస్య మరింత ఎక్కువైతే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి.సిజేరియన్ అయిన తల్లులు, కాన్పు కష్టంగా అయిన తల్లులు, కూర్చోడానికి ఇబ్బందిగా ఉన్న తల్లులు పడుకుని పాలు ఇవ్వడం శ్రేయస్కరం.బిడ్డ పాలు తాగేటప్పుడు చనుమొనను అందుకోక పోవడం లాంటివి జరిగితే తల్లీ బిడ్డ వైపుకి వంగకుండా రొమ్మును వేళ్ళతో ఎత్తి పట్టుకోవాలి.అప్పుడు బిడ్డ పాలు త్రాగేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవవు.బిడ్డకు పాలు ఇచ్చిన తరువాత బిడ్డని ఎత్తుకుని వెనుక వైపు వీపు మీద తట్టాలి.. ఇలా తట్టడం వాళ్ళ వల్ల పాలు త్వరగా జీర్ణం అవుతాయి.తల్లి కూడా ఒకసారి కుడివైపు పాలు ఇస్తే తర్వాత ఎడమ వైపు రొమ్ములో పాలు ఇవ్వాలి.. ఇలా చేయడం వల్ల పాలు రొమ్ములలో నిల్వ లేకుండా ఉంటాయి..  

 

 

 

సుఖ ప్రసవం అయిన తల్లులు ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. సిజేరియన్ అయిన తల్లులు ఈ పద్ధతి ఉపయోగించడం మంచిది కాదు.ఎందుకంటే ఈ పద్ధతిలో ఎక్కువ ఒత్తిడి తల్లి కడుపు మీద పడుతుంది.బిడ్డకి కుడి రొమ్ము నుండి పాలిస్తుంటే కుడిచేతితో, ఎడమ రొమ్ము నుండి పాలిస్తుంటే ఎడమ చేతితో బిడ్డను పట్టుకోవాలి. తల్లి తన మోచేయిని బిడ్డ తల ,మెడ,వీపు భాగానికి ఆధారంగా పెట్టాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: