గర్భంతో ఉన్న స్త్రీ ఎప్పుడు తన బిడ్డ గూర్చే ఆలోచిస్తుంది. ఎప్పుడు కడుపులో నుంచి బయటకు వస్తాడా.. అమ్మ అని ఎప్పుడు పిలుస్తాడా అని కలలు కంటుంది. తొమ్మిది నెలలు ఎప్పుడు నిండుతాయా అని ఎదురుచూస్తారు.. కానీ  కొన్నిసార్లు కొన్ని అనుకోని పరిస్థితులలో బిడ్డకు ముందుగానే జన్మనిస్తారు.అలా నెలలు నిండకుండా పుట్టడానికి చాలా కారణాలు ఉంటాయి.అలా పుట్టిన బిడ్డకు అదనపు రక్షణ అవసరం. అందుకే తల్లి కొన్ని జాగ్రతలు పాటించాలి.  మీకు ప్రసవపు నొప్పులు ముందుగానే వస్తే, మీరు తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్ళాలి. జన్మించు సమయంలో మీ బిడ్డకు అదనపు సంరక్షణ అవసరమవుతుంది. మీ బిడ్డ ఆకారం చిన్నదిగా ఉండి, బలహీనంగా ఉంటే బిడ్డకు  శక్తి వచ్చేంతవరకు మీరు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుంది.

 

 

 

 

మీ బిడ్డకు చనుబాలనివ్వడమనేది అతని ఆరోగ్యాన్ని సంరక్షించుటకు ఉత్తమమైన వాటిలో ఒకటి.  వీటినే ముర్రుపాలు అంటారు. మీ మొదటి చనుబాలు చిక్కగా, మీగడలాగా మరియు మంచి పోషకాలతో నిండి ఉంటాయి.వీటిని ఎట్టి పరిస్థితులలో  పారబోయకండి.మీకు  జన్మించిన శిశువుకు, మీ రొమ్ములనుండి పాలను గ్రహించేంత శక్తి ఉండకపోవచ్చు.ఎందుకంటే నెలలు నిండకుండా పుట్టాడు కాబట్టి. అందుకే ఇలా చేయండి.  ఒక శుభ్రమైన పాత్రలో (ఉగ్గు గిన్నెలో) మీ రొమ్ముపాలను పిండి,బిడ్డకు త్రాగించండి.పాలు పట్టే ముందు  ఆ ఉగ్గు గిన్నెను ముందుగా మరిగే నీటిలో కొద్దిసేపు వేసి తరువాత చల్లబరచండి. దీనివలన ఆ గిన్నెపై ఉండే క్రిములు నశిస్తాయి. తరువాత మీ రొమ్ము పాలను ఆ ఉగ్గు గిన్నెలో వేసి, మీ శిశువుకు త్రాగించండి.

 

 

 

 

 

ఫీడింగ్ బాటిల్ కు బదులుగా ఉగ్గు గిన్నె లేదా పాత్రను, చెంచాను ఉపయోగించండి, ఎందుకంటే బాటిల్ ను శుభ్రపరచడం కొంచెం కష్టం మరియు సంక్రమణ ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది.శిశువును మీ తొడపై పడుకోబెట్టుకోండి. మీ శిశువు క్రింది పెదవికి తాకేటట్టుగా ఉగ్గుగిన్నెను లేదా చెంచాను ఉంచండి మరియు అతని నోటిలో కొద్ది కొద్దిగా పాలను పోయండి. మీ శిశువుకు వెచ్చదనం కూడా అవసరమే. మీకు వీలయినప్పుడు బిడ్డను ఎక్కువసేపు హత్తుకోండి. పక్కన పడుకోబెట్టుకుని వెచ్చదన్నాని ఇవ్వండి.అలాగే బిడ్డకు ఎటువంటి చిన్న ఇబ్బంది కలిగిన గాని వైద్యుడిని సంప్రదించండి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: