మహిళలు ఎంత అందంగా ఉన్నా కూడా కంటి కింద నల్లటి వలయాల కారణంగా బయటకు రావడానికి, ఏదైనా ఫంక్షన్ లకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు.ముఖం అంత మిల మిల మెరిసిపోతుంది కానీ కళ్ళ దగ్గర మాత్రం నల్లటి వలయాలు  కన్పిస్తాయి.అయితే కళ్ళ కింద  నల్లటి వలయాలు పోయి మీ కళ్ళు తేజోవంతంగా వెలిగిపోయే కొన్ని  సింపుల్ టిప్స్ ను మీరు ఫాలో అయినట్లయితే వెంటనే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.అసలు ముందు మీరు కళ్ళ కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయో తెలుసుకోవాలి.

 

 

 

 

మన  కంటి కింద నల్లటి వలయాలు లేదా నల్లటి మచ్చలు రావడానికి కారణం  సరైన నిద్రలేకపోవడం, డిప్రెషన్, ఒత్తిడి, ఎండలో తిరిగి వచ్చినప్పుడు, విటమిన్ బి-12 లోపం, అనారోగ్యం, రక్త శాతం తక్కువగా ఉన్నపుడు,  అలసిపోయినప్పుడు కంటి కింద మచ్చలు లేదా నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. వీటినే  మనం  డార్క్ సర్కిల్స్ అని అంటాము. ఆ డార్క్ సిర్కిల్స్ ను తగ్గించడానికి ఏమి చేయాలో చుడండి. పచ్చి పాలలో దూదిని ఉంచి, ఆ దూదితో కళ్ళ కింద మసాజ్ చేసుకోవడం వలన డార్క్ సర్కిల్స్ త్వరగా తగ్గిపోతాయి.అలాగే  కీరదోస, ఆలుగడ్డను సగానికి కోసి రెండిటిని బాగా మెత్తగా చేసుకుని వాటి నుండి గుజ్జును బయటకు తీయాలి.ఇందులో ఒక స్పూన్ తేనె మరియు ఒక స్పూన్ అలోవెరా జెల్ కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని నల్లటి వలయాల కింద రాసుకోవడం వలన డార్క్ సర్కిల్స్ తగ్గి ప్రకాశవంతంగా ఉంటాయి.

 

 

 

ఒక స్పూన్ నిమ్మరసం మరియు టమోటో రసాన్ని గిన్నెలోకి తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ శనగపిండి కలుపుకుని మిశ్రమంగా చేసుకున్నాక కంటి కింది వలయాలపై రాసుకోవడం వలన ఈ సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు.రోజ్ వాటర్ లో దూదిని కొన్ని నిముషాల పాటు ఉంచి బయటకు తీసి కళ్ళను మూసి కళ్లపై రోజ్ వాటర్ లో ఉంచిన దూదిని పెట్టుకోవాలి. 5 లేదా 10 నిముషాల తర్వాత వీటిని తీసివేసి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.కంటి కింద నల్లటి మచ్చలతో ఇబ్బందిపడేవారు తేనెను నల్లటి మచ్చలపై రాసుకుని మసాజ్ చేసుకోవాలి. పది నిముషాల తర్వాత క్లీన్ చేసుకుంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.పైన చెప్పిన టిప్స్ అన్ని మన ఇంట్లో అందుబాటులో ఉండేవే పైగా పెద్ద ఖర్చులేని పని కూడా.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: