సాధార‌ణంగా పెళ్లైన ప్ర‌తి మ‌హిళ త‌ల్లి కావాల‌ని ఆశ‌ప‌డుతుంది. అందుకోసం ఆరాట‌ప‌డుతుంది. ప్ర‌తి స్త్రీ జీవితంలో త‌ల్లి అవ్వ‌డం అనేది అద్భుత‌మైన‌, అపూర్వ‌మైన ఘ‌ట్టం. అయితే ఇటీవ‌ల కాలంలో `మాకు పిల్ల‌లు వ‌ద్దు` అనే వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఈ మాటలు వింటుంటే విడ్డూరంగా అనిపించొచ్చు కాని ఇది నిజం. ఒక పక్క భారత్, చైనా వంటి దేశాలు తమ దేశ జనాభా నానాటికీ పెరిగిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. కొన్ని దేశాల్లో మాత్రం పిల్లలను కనండి.. నజరానాలు కూడా ఇస్తామ‌ని చెబుతున్నారు. కాని, మ‌హిళ‌లు మాత్రం ఆస‌క్తి చూప‌డం లేద‌ట‌.

 

ఇక ముఖ్యంగా  జపాన్ దేశంలో నెలకు ఒకసారి కూడా శృంగారం చేసుకోని జంటలు వేల సంఖ్యలో ఉంటాయట. అందుకే అక్కడి ప్రభుత్వాలు..  మహిళలకు సెలవులు ఇచ్చి మరి పిల్లల్ని కనమని ప్రోత్సహిస్తున్నార‌ట‌. కాని, వారు మాత్రం ఆసక్తి చూపించడం లేదట‌. దీంతో అక్క‌డ పిల్లల జనాభా లేక రానురాను వృద్ధుల సంఖ్య పెరుగుతోంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే  వాషింగ్టన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ వర్సిటీ పరిశోధన చేప‌ట్ట‌గా.. అందులో షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

 

ఇటీవ‌ల కాలంలో మ‌హిళ‌లు విద్యా, ఉద్యోగం అంటూ పెళ్లి చేసుకోవడం లేద‌ని.. ఒక‌వేళ పెళ్లి చేసుకున్నా పిల్లలను లేట్ గా కంటున్నార‌ట‌. ఇక కొంద‌రు మాత్రం అస్స‌లు పిల్లల్ని కనడానికే ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని ప‌రిశోధ‌న‌లో తెలిసింది. ఈ పరిణామం జ‌పాన్‌, స్పెయిన్ సహా 23 దేశాల్లో ఉందని తేలింది. ఫ‌లితంగా ఆయా దేశాల్లో జ‌నాభా సంఖ్య దారుణంగా పడిపోతోంది. ఇక ఇదే రీతిలో మ‌రికొన్నేళ్లు కొన‌సాగితే..  2100 నాటికి ప్రపంచంలో 80 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతుందని.. అదే స‌మ‌యంలో మ్యాన్ పవర్ కొరత భారీగా ఏర్పడుతోంద‌ని తాజా ప‌రిశోధ‌న తెలిపింది. అయితే  భార‌త్ మాత్రం జనాభాలో చైనాను దాటేసి నంబర్ 1 ర్యాంకు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: