ప్రపంచ జనాభాలో సగభాగం పైగా స్త్రీలు ఉన్నా  ఇంకా స్త్రీలు అన్నిరంగాలలోనూ తమ అవకాశల కోసం పోటీ పడవలసిన పరిస్థితులలో సమాజంలో వివక్షతకు గురి అవుతూనే ఉన్నారు. మనదేశ సార్వభౌమత్వానికి చిహ్నంగా నిర్వహింపబడే రిపబ్లిక్ డే పరేడ్ ను ఒక మహిళ నాయకత్వం వహిస్తూ లీడ్ చేసినా ఇంకా అన్ని రంగాలలోను స్త్రీలు అణచి వేయబడుతూనే ఉన్నారు. 

ఈ సమస్యలు కేవలం వెనుకబడిన అభివృద్ది చెందుతున్న దేశాలలోనే మాత్రమే కాదు అభివృద్ధి చెందిన అమెరికా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ లాంటి దేశాలలో స్త్రీలు ఇప్పటికీ వివక్షతకు గురి అవుతూనే ఉన్నారు. 1908 సంవత్సరం మార్చి 8న అమెరికా దేశంలోని మహిళలు తమకు ఉద్యోగాలలో సమాన అవకాశాలు వేతనాలు కావాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన భారీ నిరసన ఉద్యమాన్ని గుర్తుకు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ప్రపంచం యావత్తూ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 
ఇక  భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లు అవుతున్నా మహిళలకు మాత్రం ఇంకా సమానత్వం సిద్ధించలేదు. గృహిణిగా శ్రమజీవిగా ఉద్యోగిగా ప్రజాప్రతినిధిగా అన్ని రంగాల్లోనూ మహిళలు ఆరంగాలను ప్రభావితం చేస్తూ రాణిస్తున్నా ఇప్పటికీ దేశంలో చాలమంది స్త్రీలు తాము సంపాదించిన మొత్తాలను భర్తల చేతిలో పెడుతూ భర్త చేతిలో  కీలుబొమ్మలుగానే ఉంటున్నారు అన్నది వాస్తవం.   
Happy International Womens Day 2019
వాస్తవానికి నేటికీ మహిళ దోపిడీకి గురు అవుతూనే ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు సుదూర స్వప్నంగానే  మిగిలిపోయింది. మనదేశం కన్నా అతి చిన్న దేశాలు అయిన ఐస్లాండ్ ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ వంటి దేశాలలో ఉన్న మహిళా సాధికారిత ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వాయం అయిన మనభారత్ లో లేకపోవడం అత్యంత దురదృష్టకరం. ఒక అధ్యయనం ప్రకారం మన దేశంలో సంపాదించే స్త్రీలు కూడ పురుషులకంటే ఎక్కువగా అదనంగా తమ ఇంటి పని పాటలు చూసుకుంటూ 5 గంటలు ఎక్కువగా పని చేస్తున్నారు అని అద్యయనాలు తెలియ చేస్తున్నాయి. ఇలా ఎన్నో వ్యత్యాసాలు మరెన్నో అణచివేతల మధ్య కొనసాగుతున్న స్త్రీ శక్తిని దేవతగా భావించే పురుషాధిక్య ప్రపంచం స్త్రీల విలువలను పూర్తిగా గుర్తించిన నాడే మహిళా అభ్యుదయం..

భారత్‌లో మహిళలు పురుషులతో పోలిస్తే రోజూ అయిదు గంటల పాటు ఎలాంటి ప్రతిఫలం లభించని పని చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. పని విభజనలో తారతమ్యం ఏ దేశంలోనూ ఈ స్థాయిలో ఉండదు. ఆర్ధిక సాధికారతలో వెనకబాటుకు ప్రధాన కారణమదే. మహిళా యాజమాన్యంలోని సంస్థలు అతి తక్కువ శాతం ఉన్నదీ భారత్ లోనే. ప్రపంచవ్యాప్తంగా గడిచిన పదేళ్లలో మహిళా కార్మిక శక్తి 150 కోట్ల నుంచి 175 కోట్లకు పెరిగింది. కానీ మహిళల వార్షిక వేతనం చూస్తే ప్రస్తుతం స్త్రీలు సంపాదిస్తున్న జీతం పదేళ్ల క్రితం పురుషుడు సంపాదించిన దానితో సమానం. ప్రగతి బాటలో స్త్రీ పురుషుల మధ్య అంతరం తగ్గుతూ పోయిన కొద్దీ జీడీపీ పెరుగుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ రంగంలో అంతరాలను అధిగమించిన దేశం సుసంపన్నం అవుతోంది. ఇకనైనా మహిళ స్థితిగతులు మారి, మన దేశం సుసంపన్నం కావాలని మనసారా కోరుకుందాం.



మరింత సమాచారం తెలుసుకోండి: