ఆ కుంచెకు ప్రకృతితో మాట్లాడటం తెలుసు. ప్రకృతి బాషను చక్కగా అర్థం చేసుకోవడం కూడా తెలుసు. అందులోనూ ప్రకృతి భావాలను చక్కగా ఫాబ్రిక్ పెయింటింగ్ ల ద్వారా వ్యక్తం చేయడం తెలుసు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. కానీ ప్రసిద్ధ చిత్రకారిణిగా ముందు విదేశాల్లో విజయ పతాకాన్ని ఎగురవేసి ఇప్పుడు ఇండియాలో తన చిత్ర కళాకౌశలాన్ని ప్రదర్శిస్తున్నారు షీలా రాజ్. ఆమె కుంచె నుంచి జీవం పోసుకున్న ప్రతి చిత్రం ప్రకృతితో మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి. ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన షీలా రాజ్ ఫాబ్రిక్ ఆర్ట్ ఎగ్జిబిషన్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన షీలా రాజ్ కు ద్భుత భవిష్యత్తు ఉందన్నారు.



గత రెండు దశాబ్దాల సుదీర్ఘ చిత్ర కళా ప్రయాణంలో షీలా రాజ్ సమకాలీన ఆర్ట్ వరల్డ్ లో ఎన్నో ప్రయోగాలు చేసి, ఫాబ్రిక్ ఫెయింటింగ్ లో సరికొత్త ప్రమాణాలు సృష్టించారని కొనియాడారు. ఆమె కుంచెకు అన్ని జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అది సప్త వర్ణాలతో మమేకం కావడం మాత్రమే కాదు.. ప్రకృతి పలికే రాగాలను చిత్ర కళా రూపంలో ప్రదర్శించడంలో ఆమెకు ఆమె సాటి అని చంద్ర బోస్ ప్రశంసించారు. నా చిత్ర కళా ప్రయాణం నా బాల్యంలో ఏడేళ్ళ ప్రాయంలో ప్రారంభమైదన్నారు షీలా రాజ్. మా స్కూల్ లో మొట్టమొదటి సారిగా  స్టిల్ లైఫ్ పెయింటింగ్ పోటీల్లో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ గెల్చుకున్నాను.



అలా మొదలైన నా ప్రస్థానంలో పలు దేశాలకు చెందిన పలువురు కళా కోవిదుల వద్ద వివిధ కళా ప్రక్రియల్లో ప్రవేశాన్ని‌ , ప్రావీణ్యాన్ని పొందాను. న్యూయార్క్ ప్లెయిన్స్ బోరో పబ్లిక్ లైబ్రరీలో వరుసగా గత 2014 నుంచి 2018 వరకు లైవ్  డేమానిస్ట్రేషన్ చేశాను. ప్రస్తుతం నేను అమెరికాలో పిల్లలకు  , మహిళలకు ఆక్రీలీక్ ఫ్రీ హాండ్ డెకరేటివ్ పెయింటింగ్ లో ఫాబ్రిక్ పెయింటింగ్ లో శిక్షణ ను , టెక్నిక్ లను నేర్పిస్తున్నాను. కార్యక్రమంలో టెలివిజన్ ప్రోడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు షరీఫ్ మొహమ్మద్ , ప్రముఖ చిత్రకళాకారులు ఎం.వి.రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: