మూతి మీద మీసం వచ్చిందంటే చాలా అందరికి నా పెళ్లి, పెళ్ళాము అనే ఆలోచనలు కూడా బాగానే వస్తుంటాయి. అది మానవ నైజం కూడాను. అయితే, ఎలాంటి అమ్మాయి తన జీవితంలోకి వస్తుందో..తనని ఇలా చూసుకోవాలి ఆలా చూసుకోవాలి అంటూ ఎన్నో ఆశలు, కలలు కంటూ ఉంటాడు. ఈ విదంగా  ఎక్కువమంది అబ్బాయిలు సన్నగా నాజూగ్గా ఉన్న అమ్మాయిలనే ఇష్టపడుతుంటారు. కొంచం బొద్దుగా, లావుగా ఉన్న అమ్మాయిలను అబ్బాయిలు కన్నెత్తి కూడా చూడరు. అయితే ఇటీవలే జరిగిన కొన్ని సర్వేల ప్రకారం చూస్తే సన్నగా ఉన్న అమ్మాయిల కంటే కొంచం బొద్దుగా ఉన్న అమ్మాయిలను పెళ్లాడితే మీ దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందంటూ సర్వేలలో తేలింది.


అదేంటి లావుగా, సన్నగా ఇదంతా ఒక ట్రాష్..ఒక అమ్మాయి మనసు,ఆమె వ్యక్తిత్వం మంచిదై ఉంటే చాలు వారి దాంపత్యం నూరేళ్లు కళకళలాడుతూ ఉంటుంది..అని కొట్టిపారేయకండి ఎందుకంటే కాలం మారింది. ప్రస్తుతం ఈ ప్రపంచంలో మంచి మనసు, చెడ్డ మనసు, వ్యక్తిత్వ వికాసాలు ఇలాంటివి తగ్గిపోయాయని, ప్రస్తుత రోజుల్లో ఏ మనసైన డబ్బు చుట్టూ తిరగాల్సిందే..అంటూ సర్వేలో తేలింది. కాబట్టి బక్క పలుచగా ఉన్న అమ్మాయిలతో పోలిస్తే బొద్దుగా ఉన్న అమ్మాయిలు కొంచం అనుకువుగా ఉంటారట. 


లావుగా ఉన్న అమ్మాయిల మనస్తత్వం ఎలా ఉంటుందంటే.. డబ్బు ఎక్కువుగా ఖర్చుపెట్టడానికి ఇష్టపడరట. మేకప్స్, షాపింగ్, జ్యూయలరీ, ఇలాంటి వాటికి కొంచం దూరంగా ఉంటారని సర్వేలలో తేలింది. నేషనల్ అటానమస్ యూనివర్సిటీ ఆఫ్ మెక్సికో సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అమ్మాయిల సైజుకు వారి మానసిక వ్యక్తిత్వానికి సంబంధం ఉంటుందట. అంతేకాకుండా కొంచం బొద్దుగా ఉన్న అమ్మాయిలు ఎక్కువుగా నవ్వుతు నవ్విస్తూ ఉంటారట. 



బొద్దుగా ఉన్న అమ్మాయిలను పెళ్లాడిన అబ్బాయిలు ఇతరులతో పోలిస్తే పది రెట్లు సంతోషంగా ఉంటున్నారని ఈ సర్వే వెల్లడించింది. బొద్దుగా ఉన్న అమ్మాయిలను చేసుకున్న భర్తలు ఎప్పుడు సంతోషంగా ఉంటారట, వారి దాంపత్య జీవితంలో ఏవైనా సమస్యలు వస్తే ముందుగా భార్యే స్పందించి ఆ సమస్యకు మార్గాన్ని చూపిస్తుందట. అంతేకాదు నలుగురిలో కలుపుగోలుతనం లావుగా ఉన్న అమ్మాయిలకె ఎక్కువని సర్వేలు వెల్లడించాయి.
చూసారుగా ఫ్రెండ్ లావు అని తీసి పడేయకండి..లావుగా ఉన్న వాళ్ళు ప్రేమగా చూసుకోవడంలో ఎప్పుడు ముందుంటారు. లావు అనేది శరీరానికే కానీ మనసుకు కాదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: