చర్మం ఎప్పుడు తాజాగా ఉండాలని అందరి అనుకుంటారు..బాబోయ్..శీతాకాలం ఇది వచ్చిందంటే చాలు ఎంతో మృదువుగా ఉన్న మన చర్మం పొడిబారుతుంది. లేతగా ఉన్న పెదవులు పగలడం, ఒళ్ళంతా తెల్లగా పొడిబారడం జరుగుతూ ఉంటుంది. వీటిని తగ్గించుకోవడానికి అందరూ రకరకాల మాయిశ్చరైజర్ క్రీములను ఎక్కువగా వాడతారు. అయితే ఎన్ని క్రీములు వాడిన అవి కొద్దిసేపు మాత్రమే పనిచేస్తాయి. కాబట్టి మన శరీరంలోని అంతర్భాగం తాజాగా ఉంటే ఏ కాలంలోనైనా మన చర్మం కాంతివంతంగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలోతప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. మనం తినే ఆహారంలో కూడా కొన్ని మార్పులు కూడా చేసుకుంటే మీ శరీరం తాజాగా ఉంటుందని బ్యూటీ నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఆ జాగ్రత్తలు ఏంటో, పాటించవలసిన చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 
వర్షాకాలంలో  మీ శరీరం తాజాగా ఉండాలంటే నీరు ఎక్కువగా నీరు తాగాలి. దానితో పాటు ఒక వాసెలిన్ , బాడీలోషన్ దగ్గర ఉంచుకోండి. మీ చర్మం తెల్లగా పొడిబారిందనిపిస్తే వెంటనే అలాంటివి మీ శరీరానికి అప్లై చేయడం వలన మీకు తక్షణమే ఉపశమనం లభిస్తుంది. అప్పుడప్పుడు ఈ బాడీ లోషన్ ఒళ్ళంతా రాసుకొని గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే మీ శరీరం మృదువుగా మారుతుంది.
ప్రతిరోజు మీరు వేడిపాలలో కొంచం బెల్లం కలిపి తాగాలి. దీనిమూలానా మీకు మంచి ఆరోగ్యమే కాకుండా మీ చర్మానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి.
వర్షాకాలం వచ్చిన దగ్గర నుండి మీరు రోజు స్నానము చేసే నీటిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్, లేదా కొబ్బరి నూనె లాంటివి కొన్ని చుక్కలు వేడినీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే మీ శరీరానికి ఒక మాయిశ్చరైజర్ వలె పనిచేస్తుంది.

మీరు ఎక్కువగా క్రీములు వాడుతున్నట్లైతే విటమిన్‌ ‘ఇ’ ఉండే క్రిములు వాడడం మంచిది.
మీరు వర్షాకాలంలో సాధారణ సబ్బుల కంటే గ్లిజరీన్ ఎక్కువగా ఉండే సబ్బులను వాడడం ద్వారా మీ శరీరం పొడిబారకుండా ఉంటుంది. ఇంకా రాత్రి నిద్రపోయే ముందు ఒళ్ళంతా వాసెలిన్ రాసుకోవాలి అప్పుడే మీ శరీరం మృదువుగా తయారవుతుంది.


వారానికి ఒకసారైనా వేడిచేసిన కొబ్బరినూనె తో ఒళ్ళంతా మసాజ్ చేసుకొని గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ద్వారా మీ శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి మీ చర్మం మెరుస్తూ ఉంటుంది. శీతాకాలంలో పాదాలు పగలకుండా ‘సాక్స్’ వేసుకోవడం మంచిది.
అదండీ మనం ఒక్కొక్క కాలములో ఒక్కొక్క రీతిలో మన చర్మాన్ని రక్షించుకోవాలి. అప్పుడే కాలానుగుణంగా మనం సంతోషంగా కాంతివంతమైన చర్మాన్ని, యవ్వనాన్ని పొందగలమంటూ విశ్లేషకులు అబిప్రాయపడుతున్నారు.
చూసారుగా వర్షాకాలంలో చర్మం తాజాగా ఉండాలంటే పైన చెప్పిన టిప్స్ పాటిస్తే చాలు.. పొడిబారకుండా తాజాగా ఉంటుంది.. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: