విద్యారంగంలో మహిళల పాత్ర ఎక్కువ. ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లుగా మహిళలే ఉంటారు. కానీ వారికి ప్రసూతి సమయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగం మానేయాల్సి ఉంటుంది. ప్రసూతి తర్వాత వెళ్తే ఉద్యోగం ఉంటుందన్న గ్యారంటీ లేదు.


అందుకే ఈ ఇబ్బందులు తొలగించేందుకు కేరళ సర్కారు ప్రయత్నించింది. చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ విద్యారంగంలోని వేలాదిమంది మహిళా ఉద్యోగులను, ఉపాధ్యాయులను ప్రసూతి ప్రయోజన చట్టం పరిధిలోకి తీసుకువస్తోంది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


ప్రసూతి ప్రయోజన చట్టం ప్రయోజనాలను ప్రైవేట్ విద్యా రంగంలోని ఉద్యోగులకు వర్తింపజేసేందుకు అనుమతివ్వాలన్న కేరళ సర్కారు ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేరళ సర్కారు నిర్ణయం అమల్లోకి వస్తే ప్రైవేట్ విద్యారంగంలోని వేలాదిమందికి లబ్ధి చేకూరతుంది.


ఈ చట్టం కింద మహిళా ఉపాధ్యాయులు 26 వారాలపాటు ప్రసూతి సెలవు రోజులను పొందుతారు. అంటే దాదాపు 6 నెలలన్నమాట. అంతే కాదు. ఆయా సెలవు రోజులకు వేతనం సైతం పొందుతారు. కేరళ బాటలోనే మిగిలిన రాష్ట్రాలూ ఇదే ఫాలో అయితే బావుంటుంది కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: