కావాల్సిన పదార్ధాలు : ఉల్లిపాయలు : అర కిలో మినపగుండు: అర కిలో అల్లం : 25 గ్రాములు జీలకర్ర : ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి : 100 గ్రాములు ఉప్పు : తగినంత   తయారు చేయు విధానం : ' ముందురోజు రాత్రి మినపగుండును నానబెట్టుకోవాలి. తెల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి ముక్కల్లో ఉప్పు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిలో అల్లం పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిని పాలదిన్ కవర్ మీద వడియాల్లాగా పెట్టి బాగా ఎండబెట్టుకోవాలి. బాగా ఎండిన తర్వాత నూనెలో వేయించుకుని తింటే బాగుంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: