మెంతి చట్నీ కావలసిన పదార్థాలు: మెంతి ఆకు : నాలుగు కప్పులు చింతపండు : నిమ్మకాయంత ఎండు మిర్చి : రెండు పచ్చి మిర్చి : మూడు మినపపప్పు : చెంచెడు అల్లం ముక్క : చిన్నది జీలకర్ర : అర చెంచెడు ఎల్లిపాయలు : ఆరు ఇంగువ : చిటికెడు నూనె : సరిపడా ఉప్పు : రుచికి తగినంత తయారు చేసే పద్ధతి: మూకుడులో కొద్దిగా నూనె వేసి ఎండు మిర్చి, పచ్చి మిర్చి, మెంతి ఆకును వేరువేరుగా వేయించాలి. అందులో చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నూనె వేసి కాగాక సన్నగా తరిగిన అల్లం ముక్కలు, చిదిమిన ఎల్లిపాయలు, మినపపప్పు, జీలకర్ర, ఇంగువ వేసి కొంచెం సేపు వేయించాలి. దాంట్లో గ్రైండ్ చేసిన మెంతి మిశ్రమం, ఉప్పు వేసి కలిపి దించాలి. ఈ చట్నీ ఇడ్లి, వడలాంటి టిఫిన్లకు బాగుంటుంది. ఈ వారం వంటలు పంపినవారు: - కె. నీరజాదేవి, హైద్రాబాద్

మరింత సమాచారం తెలుసుకోండి: