మామిడి పూరీలు  కావలసిన పదార్థాలు:- గోధుమపిండి: 200 గ్రా. మైదాపిండి: 50 గ్రా. పంచదార పొడి : 2 టీస్పూన్లు కారం:  అర టీస్పూను మామిడిపండు రసం: 1 కప్పు, నెయ్యి: 3 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు : చిటికెడు, నూనె: పూరీలు వేగించడానికి సరిపడా  తయారుచేసే విధానం:  గోధుమపిండి, మైదాపిండి, పంచదార పొడి, కారం, ఉప్పులను ఒక ప్రాతలో వేసి, మామిడిరసం, నెయ్యిని కొద్ది కొద్దిగా వేస్తూ పూరీల పిండిలా కలుపుకోవాలి. సరిపోకపోతే నీళ్లు కూడా వాడొచ్చు. తడిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీలు వత్తుకోవాలి. నూనెలోంచి మామూలు పూరీల్లా వెంటనే తీసేయకుండా కాస్త వేగనివ్వాలి. ఈ పూరీలను వేడివేడిగా మాంగో ఆపిల్‌ స్వీట్‌ చట్నీతో తింటే మరింత బాగుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: