చిల్లీ ప్రాన్ మసాలాకు కావలసిన పదార్థాలు: రొయ్యలు - 1 కిలో పచ్చిమిర్చి - 2 ఉల్లిపాయ - 2 టొమాటో - 1 అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 2 చెంచాలు కారం - 2 చెంచాలు జీలకర్ర పొడి - 1 చెంచా నిమ్మరసం - 1 చెంచా ఉప్పు,నూనె - తగినంత తయారీ విధానం:  రొయ్యలను ఒలిచి,శుభ్రంగా కడిగి ఆరబెట్టలి. నూనె వేడిచేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలను వేయాలి. బాగా వేగిన తరువాత రొయ్యలను వేయాలి. వేగాక జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఉప్పు, కారం, నిమ్మరసం కూడా వేసి బాగా కలిపి మూత పెట్టాలి. పది నిమిషాలు ఉడికాక దించేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: