కావలసిన పధార్థాలు:
బాస్మతి రైస్: 2cups(శుభ్రం చేసి నీటిలో నానబెట్టుకోవాలి)
పచ్చిమామిడి: 1 ( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా తురుముకోవాలి)
జీలకర్ర: 1/2 tsp
పచ్చిమిర్చి: 2 (slit)
చెక్క: చిన్న ముక్క
యాలకులు: 4
లవంగాలు: 4
మిరియాలు: 6
నెయ్యి: 1tbsp
పసుపు: 1/2 tsp
జీలకర్ర: 1tsp
అల్లం: 1చిన్న ముక్క(తురుము కోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
- ముందుగా ప్రెజర్ కుక్కర్ లో నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీలకర్ర మరియు పచ్చిమిర్చి ముక్కలు, చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు వేసి రెండు నిముషాలు లైట్ గా వేగించుకోవాలి.
- ఒక నిముషం తర్వాత అల్లం తురుము వేసి మరో నిముషం వేగించాలి.
- ఇప్పుడు అందులోనే పచ్చిమామిడి తురుము వేసి తక్కువ మంట మీద ఐదు నిముషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
- అందులోనే పసుపు ఉప్పు వేసి మరో నిముషా వేగించి, తర్వాత శుభ్రం చేసినానబెట్టుకొన్న బియ్యాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
-ఇప్పుడు అందులో 3కప్పుల నీళ్ళు పోసి ప్రెజర్ కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
- తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఐదు నిముషాల తర్వాత మూత తీసి మాంగో పులావ్ ను గరం మసాల మరియు కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేయాలి. అంతే సమ్మర్ స్పెషల్ మాంగో పులావ్ రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: