బొమ్మిడాల పులుసు కి కావలసిన పదార్ధాలు:

బొమ్మిడాయి చేపలు – 10 (ఎండినవి)
ఉల్లిపాయలు ముక్కలు – 1/2 కప్పు 
టొమాటో ముక్కలు - 1/2 కప్పు 
పచ్చిమిరపకాయలు – 3 
కరివేపాకు – కొద్దిగ 
అల్లం,వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్ 
పసుపు – 1/4 స్పూన్ 
కారం పొడి – సరిపడ 
ఉప్పు – తగినంత 
గరంమసాలా పొడి – 1/4 స్పూన్ 
చింతపండు పులుసు – 1/2 కప్పు 
నూనె – 5 స్పూన్స్ 

బొమ్మిడాల పులుసు తయారు చేసే విధానం:

బొమ్మిడాయిలు చేపలను చివరలు తీసేసి రెండంగుళాల ముక్కలుగా కట్ చేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి ఈ చేప ముక్కలను 5 నిముషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు,పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఎర్రగా వేయించాలి.
 
ఇప్పుడు అందులో పసుపు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, టొమాటో ముక్కలు వేసి మరి కొద్దిసేపు వేయించాలి. వేయించిన బొమ్మిడాయిలు కూడా వేసి కలిపి మరో ఐదునిమిషాలు వేయించాలి. తరువాత 1 కప్పు నీళ్లు పోసి, సరిపడ ఉప్పు వేసి కలిపి మూత పెట్టి చిన్న మంటపై చేప ముక్కలు కొద్దిగా మెత్తగా ఉడికేవరకు ఉంచాలి. 

ఈ ముక్కలు కొద్దిగా మెత్తబడగానే చింతపండు పులుసు, గరం మసాలా పొడి, సరిపడ ఉప్పు, కారం వేసి కలిపి మరో పది నిమిషాలు చిన్న మంటపై ఉడికించి నూనె కొద్దిగా తేలాక దింపేయాలి. అంతే రుచికరమైన బొమ్మిడాయిల పులుసు రెడీ, ఇది అన్నం, రొట్టెలలోకి బావుంటుంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: