బీట్‌రూట్ సలాడ్ కావలసిన పదార్థాలు:

బీట్‌రూట్ తురుము : ఒక కప్పు

టమాట తరుగు : రెండు చెంచెలు
ఎండుమిర్చి : రెండు
కొత్తిమీర తరుగు : చెంచెడు
నిమ్మరసం : అర చెంచెడు
ఆవాలు, జీలకర్ర : చెంచెడు
నూనె : సరిపడా
ఉప్పు : రుచికి తగినంత

తయారు చేసే పద్ధతి:
బీట్‌రూట్ తురుములో టమాట తరుగు, కొత్తిమీర తరుగు వేయాలి. తర్వాత నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. మూకుడులో నూనె వేసి కాగాక జీలకర్ర, మిర్చి వేసి దోరగా వేయించాలి. ఈ పోపును బీట్‌రూట్ తురుములో కలుపుకుంటే సరి, నోరూరించే ‘బీట్‌రూట్ సలాడ్’ రెడీ!

దీనిని ఎప్పటి కప్పుడు తయారు చేసుకోలేని వారు రెండు, మూడు రోజులకు సరిపడా తయారు చేసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు.అయితే, దీనిని డయాబెటిక్ పేషెంట్లు తినకూడదు

మరింత సమాచారం తెలుసుకోండి: