టామరిండ్ జింజర్   కావలసిన పదార్థాలు: 
వేడి నీరు : నాలుగు కప్పులు
క్రిష్టలైజ్‌డ్ జింజర్ : మూడు చెంచెలు
చింతపండు పేస్టు : రెండు చెంచెలు
తాజా నిమ్మరసం : చెంచెడు
తాజా పూదీన ఆకులు : తగినన్ని
ఐస్ క్యూబులు : సరిపడా
బ్రౌన్ షుగర్ (వంటకు వాడేది) : పావు కప్పు

తయారు చేసే పద్ధతి:
ఒక పెద్ద పాత్రలో వేడి నీరు, బ్రౌన్ షుగర్, అల్లం, చింతపండు పేస్టులను వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత ఈ పాత్రను స్టవ్‌పై సిమ్‌లో పెట్టి ఐదు నిమిషాలపాటు వేడిచేయాలి. దీనికి నిమ్మరసాన్ని జతచేసి దించుకోవాలి. తర్వాత ఈ మిశ్రామాన్ని రెండు, మూడు గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆపై సర్వింగ్ గ్లాసులో ముందుగానే తగినన్ని ఐస్‌క్యూబ్‌లను వేసి కూల్‌కూల్‌గా సర్వ్ చేస్తే సరి.

మరింత సమాచారం తెలుసుకోండి: