సాధారణంగా మనం ఇంట్లో కూర లేని సమయంలో పచ్చళ్లు వేసుకొని తింటాం. పచ్చడి అనగానే మామిడి, నిమ్మ, చింతకా పచ్చళ్లు..ఇవి కొన్ని రోజుల వరకు నిల్వ ఉంటాయి.  పిల్లలు, పెద్దలు  ఎంతో  ఇష్టంగా తింటారు. అయితే నాన్ వెజ్ తో కూడా పచ్చళ్లు చేస్తుంటారు. ముఖ్యంగా చికెన్, చేపల పచ్చడి చాలా బాగుంటుంది. చేపల పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా...


 చేపల పచ్చడి కావలసిన పదార్థాలు:బొమ్మె చేపలు - కిలోమంచినూనె - 250గ్రా. ఆకు కారం - 100గ్రా.ఉప్పు - 200గ్రా. ఆవాలపొడి - ఒక స్పూన్గరం మసాలా పొడి - ఒక స్పూన్నిమ్మకాయ రసం - ఒక కప్పుజీలకర్ర పొడి - అర టీ స్పూన్మెంతిపొడి - పావు టీ స్పూన్అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 50గ్రా. తయారు చేసే విధానం: చేపలను బాగా కడిగి నీళ్లు లేకుండా తుడిచి కాసేపు ఫ్యాన్‌గాలి కింద ఆరబెట్టాలి.


ఇప్పుడు కడాయి తీసుకొని చేప ముక్కలను బంగారు రంగు వచ్చేవరకు ఒక్కొక్కటిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మళ్లీ వీటిని కాసేపు ఫ్యాన్ గాలికి ఉంచాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కారం, ఉప్పు, ఆవాలపొడి, గరం మసాలాపొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలపాలి. నూనె, చేపముక్కలు చల్లబడిన తర్వాత కారంతో పాటు అన్నీ కలిపి ఉంచిన మిశ్రమంలో వీటిని వేసి బాగా కలుపుకోవాలి. చేపల పచ్చడి తినడానికి రెడీ.  ఈ పచ్చడి తడి తగలకుండా ఉంటే సంవత్సరంపాటు నిల్వ ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: