సబ్జీ గోస్ట్ కావాలిసిన పధార్థాలు : మటన్ : 500 గ్రాములు పాలకూర : 10 కట్టలు  నూనె : 70 మి. లీ. అల్లంవెల్లుల్లి : 30 గ్రా కారం : 15 గ్రా పసుపు : 5 గ్రా  టమోటాలు : 200 గ్రా గరంమసాలా : 5 గ్రా మెంతి కూర : 4 కట్టలు ఉల్లిపాయలు : 100 గ్రా ఉప్పు : తగినంత తయారు చేసే విధానం : ముందుగా ఒక గిన్నెలో నూనె పోసి వేడి చేసాక, బాగా కడిగి తరిగిన మెంతికూరను వేసి ప్రై చేసాక, అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని వేసి ఎర్రగా ప్రై చేయండి. తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, పసుపు, వేసి అందులోనే కడిగి శుభ్రం చేసిన మటన్ ను వేసి బాగా కలియబెట్టండి, తరువాత ఉప్పు కూడా చేర్చి మూత పెట్టి ఉడికించండి.


మటన్ ఉడుకుతుండగానే అవసరమైతే కొన్ని నీళ్లు చల్లండి మాంసం ఉడకగానే శుభ్రంగా కడిగి తరిగిన పాలకూరను, టమోటా ముక్కల్ని కూడా వేసి కలియబెట్టి బాగా ఉడకించండి.  దాంతో పాలకూర కూడా ఉడికి సబ్జీ గోస్ట్ తయారు అవుతుంది. దించే ముందు గరం మసాలా చల్లి, వేడిగా పులావ్ తో గాని, వైట్ రైస్ తో గాని వడ్డించండి. 4 చికెన్ క్రీమ్ స్టిక్స్  కావాల్సిన పధార్థాలు:  చికెన్ (ఎముకలు లేనివి) : 250 గ్రా వేరుశనగ గుళ్లు : 25 గ్రా పెరుగు మీగడ : 30 గ్రా నిమ్మకాయ : అర చెక్క అల్లం: చిన్న ముక్క కొత్తిమీర –ఒక కట్ట పచ్చి మిర్చి : నాలుగు  యాలకులు : మూడు  ఉప్పు : తగినంత నూనె : రెండు టీ స్పూన్లు


తయారు చేయువిధానం :  ముందుగా ఒక గిన్నెలో ఎముకలు లేని చికెన్ ముక్కల్ని వేసి, వాటిని ఫ్రై చేసి ముద్దగా నూరిన వేరుశనగ గుళ్లు, పెరుగుమీగడ, తురుమిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, దంచిన యాలకులు, తగినంత ఉప్పు కలిపి ఒక గంట సేపు నానబెట్టండి. తరువాత నానిన ఒక్కో చికెన్ ముక్కను సన్నని వెదురు పుల్లకు గుచ్చి బొగ్గుల వేడి మీదగాని, గ్రిల్లర్ లో గాని, గ్యాస్ మంట మీదగాని కాల్చి వెజిటబుల్ సలాడ్, నిమ్మ చెక్కలతో అతిధులకు అందించండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: