టొమోటోలు చే ఏ డిష్ అయినా డబుల్ టేస్ట్ వుంటుంది. అలాంటిది పప్పు కలిపితే రెండు ముద్దలు ఎక్కువనే తినాలనిపిస్తుంది. కావాలసిన పధార్థాలు : టొమోటోలు : మూడు.  వెల్లుల్లి : 8 లేక 9 రెబ్బలు పెద్దఉల్లిపాయుల :రెండు(పై రెండెంటిని సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి)  \నిమ్మకాయ : 3టేబుల్ స్పూన్లు ఉప్పు : సరిపడ కారం మసాలా పొడి : 1/4 టీ స్పూన్లు  పెసరపప్పు : ½ టీ స్పూను  జిలకర్ర : ½ టీ స్పూన్ నూనె :1 టేబుల్ స్పూన్


తయారు చేయువిధానం : బాండీలో నూనె వేసి, కొద్దిగా నెయ్యి కూడా జత కలిపి జీలకర్ర వేసి వేయించండి. ఆపై వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసి వేయించండి. ఉల్లిపాయులు దోరగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న టొమోటాలను వేయండి.  పెసరపప్పుకు నీళ్లు జత చేసి ఉడికించాలి విడిగా.. పప్పు రెడీ అయ్యాక వేయించినవన్నీ వెల్లుల్లి, ఉల్లిపాయ, టొమోటోల ముక్కలను పప్పులోవేయండి.


ఉప్పు, గరంమసాలా పొడితో పాటు పసుపు చల్లి బాగా కలియబెట్టండి కొంతసేపు ఉడికించాక చూడండి. పప్పు రెడీ అయినదీ, లేనిది తెలస్తుంది. ఓకే అనుకుంటే పొయ్యి మీద నుంచి దించి పైన చక్కగా కొత్తిమీర చల్లి నిమ్మకాయ రసం చల్లండి.. మూతపెట్టి ఓ రెండు నిమిషాలాగి భోజనానికి ఉపక్రమించండి.  వేడిగా భావుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: