భారత దేశంలో పూర్వ కాలం నుంచి బంగారానికి ఎంతో విలువు ఉంది.  ముఖ్యంగా బంగారంతో మహిళలకు ఎన్నో రకాల ఆభరణాలు చేయిస్తారు..అవి ధరించి తమ హోదాను ప్రకటిస్తుంటారు.  పూర్వ కాలంలో మహరాణులు ఏడు వారాల నగలు ధరించే వారని చెబుతుంటారు.  ఈ పేరు వినటమే గాని అసలు ఇవి ఎంటో చాలామందికి తెలియదు .


ఆదివారము :-సూర్యుడికి ఇష్టమయిన ఈరోజున కెంపులకమ్మలు ,హారాలు ధరించాలి .

సోమవారము :-చంద్రుడికి ఇష్టమయిన ఈరోజున ముత్యాలహారాలు ,గాజులు పెట్టుకోవాలి .

మంగళవారము :-కుజుడికి ఇష్టమయిన ఈరోజున పగడాల దండలు ,ఉంగరాలు అలంకరించుకోవాలి .

బుధవారము :-బుధునికి ఇష్టమయిన ఈరోజున పచ్చల పధకాలు ,గాజులు దరించాలి .

గురువారము :-బృహస్పతికి ఇష్టమయిన ఈరోజున పుష్పరాగపు కమ్మలు ,ఉంగరాలు దరించాలి .

శుక్రవారము :-శుక్రునికి ఇష్టమయిన ఈరోజున వజ్రాలహారము ,ముక్కుపుడక ధరించి లక్ష్మీదేవిలా మీ వాళ్లకి దర్శనం ఇవ్వాలి .

శనివారము :-శనికి ఇష్టమయిన ఈరోజున నీలమణితో తయారు చేయించుకున్న కమ్మలు హరాలు ,ముక్కుపుడక ధరించాలి .

ఇవి ఏడువారాల నగలు యారోజుల్లో ఆయా నవరత్నములతో పాపిడిబిళ్ళ ,వంకీలు ఇలా ఎన్నైనా చేయించుకోవచ్చు .ఆ రొజు ఆ రత్నం సంబందించినవి బంగారంతో చేయించి పెట్టుకోవటం అంటే అంతకు మించి వైభోగం ఏమిఉండదు . కావున మహిళలు .ఏడువారాల నగలంటే ఇవి .


మరింత సమాచారం తెలుసుకోండి: