దొరక్క దొరక్క ఆ తాగుబోతు వెధవ కి పోలీస్ ఆఫీసరే దొరికినట్టు ఉంది . అర్ధరాత్రి నుంచి మొదలెట్టి తెల్లారే వరకూ ఒక మహిళా ఇన్స్పెక్టర్ ని వేధించాడు ఒక తాగుబోతు ఆకతాయి.


హైదరాబాద్ కి చెందిన మహిళా ఇన్ స్పెక్టర్ లక్ష్మీ మాధవి ఈ విషయం లో విసిగి వేసారి పోయి సీసీఎస్ పోలీసులకి ఫిర్యాదు చేసారు. దాంతో వెంటనే వారు అతని ఫోన్ నెంబర్ ఆధారంగా అతన్ని పట్టుకున్నారు. మధ్య ప్రదేశ్ లోని మొరానో జిల్లా దత్తాపుర గ్రామానికి చెందిన దుర్గేశ్ గా అతన్ని గుర్తించారు. అయితే ఇతనికి ఈ వేధింపులు కొత్త కాదు అని కనిపెట్టారు పోలీసులు.


మద్యం మత్తులో ఇంటర్నెట్ చూస్తూ, అందులోని పోలీసు, రెవెన్యూశాఖలకు చెందిన అధికారుల నంబర్లను గుర్తించి, వారికి ఫోన్‌ చేసి వేధించడం ఇతని హాబీ అని సీసీఎస్ పోలీసులు తెలిపారు.


పెద్ద పెద్ద స్థాయి లో ఉన్న అధికారులని సైతం ఇతను ఇలాగె వేధిస్తూ ఉంటాడు అని చెప్పారు వారు. హైదారబాద్ పరిసర ప్రాంతాలకి చెందిన దాదాపు ఇరవై మంది పెద్ద స్థాయి అధికారులని ఇలాగె వేధించాడు ఇతగాడు. ఫోన్ వేధింపుల్లో ఆరితేరిన ఇతగాడి బాధితుల జాబితాలో నిజామాబాద్‌, పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు, అసోం, బిహార్‌, గోవా, హర్యాణ, జమ్మూ కశ్మీర్‌, కర్ణాటక, కేరళ, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌.. ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా పోలీసు అధికారులతో పాటు ఒక డీజీపీ, అదనపు డీజీపీ కూడా ఉండడం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: