ఇండియా లో పాగా వేసిన 10 మంది నైజీరియన్ లు హైదరాబాద్ లో అడ్డంగా దొరికారు. ఫేస్ బుక్ , సోషల్ మీడియా ల ద్వారా పరిచయం చేసుకుని సైబర్ నేరాలు పాల్పడడం వీరికి అలవాటు.


వీరందరికీ ముఠా హెడ్ అయిన విలియమ్ ఆనే వ్యక్తి తో పాటు అతని ఇల్లు కూడా పోలీసులు తమ కంట్రోల్ లోకి తీసుకున్నారు. తాను లండన్ లో చర్చ్ పాస్టర్ ని అనీ మహిళ దగ్గర చెప్పి నమ్మించి మోసం చేసాడు.


తాను 50వేల అమెరికన్‌ డాలర్లు పంపిస్తానంటూ ఆ మహిళతో చెప్పి అందుకోసం ముందుగా కొంత చెల్లించాల్సి ఉంటుంద‌ని నమ్మించి, 9.37లక్షల మొత్తాన్ని వసూలు చేశాడ‌ని అన్నారు.


ఇలా చాలా మంది దగ్గర కహానీలు చెప్పి డబ్బులు సంపాదిస్తున్నట్టు గా వారి మీద ఆధారాలు ఉన్నాయి . నిందితుల నుంచి 8 ల్యాప్‌టాప్‌లు, 26 మొబైల్‌ఫోన్లు, 10 ఇంటర్నెట్‌ డేటాకార్డులు, 35 సిమ్‌కార్డులను సీజ్ చేసిన‌ట్లు తెలిపారు పోలీసులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: