సాదారణంగా బెండకాయ తింటే మెదడు బాగా పని చేస్తుందని అంటారు.  అయితే చాలా మంది బెండకాయ జిగురు గా ఉంటుందని ఎక్కువగా ఇష్టపడరు..కానీ బెండకాయను ఎన్నో రకాలుగా వండుతారు.  ముఖ్యంగా బెండకాయ వేపుడు అంటే పిల్లు చాలా ఇష్టంగా తింటారు.  సాధారణంగా మనం హోటల్స్ కి వెళ్లినా కూడా అక్కడ ఖచ్చితంగా బెండకాయ దర్శనమిస్తుంది.  ఇక బెండకాయ, పల్లీ కాంబినేషన్ లో కూరా చాలా అద్భుతంగా ఉంటుంది. 

బెండకాయ పల్లీకూర కావలసిన పదార్థాలు: బెండకాయలు : అర కిలో పల్లీలు : గరిటెడు కారప్పొడి : రెండు చెంచెలు పెరుగు : అర కప్పు పసుపు : చిటికెడు ఉల్లిగడ్డ తరుగు : అర కప్పు అల్లం, వెల్లుల్లి : చెంచెడు నూనె : సరిపడా ఉప్పు : రుచికి తగినంత తయారు చేసే పద్ధతి: మందపాటి తవ్వలో (గిన్నె) బెండకాయ ముక్కలు వేసి అందులో పెరుగు, కొంచెం ఉప్పు వేసి సన్నని సెగమీద మూతపెట్టి మగ్గనివ్వాలి.

తర్వాత మూకుడులో నూనె వేసి కాగాక దాంట్లో ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి కలుపుకుని అందులో బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. కారప్పొడి, ఉప్పు చల్లుకోవాలి. పల్లీలను వేయించి పొడిచేసి ఇందులో వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకుని దించితే సరి, రుచికరమైన ‘బెండకాయ పల్లీకూర’ రెడీ!

మరింత సమాచారం తెలుసుకోండి: