మహిళలు తమ శరీరంపై చూపించే శ్రద్ద కురులపై చూపించరు. అసలు దాని గురించే పట్టించుకోరు. జుట్టును అందంగా ఉంచుకోవాలని అనుకుంటారు. అలా అనుకూనే వారు చాలా అరుదుగా కనపడుతుంటారు మనకు. కురులను నిర్లక్ష్యం చేసేవారే అధికంగా ఉంటారు. దానికి కారణం పని ఒత్తిడి అని చెబుతుంటారు వారు. ఏకాలంలో నైనా సరే... వేసవిలో మాత్రం జుట్టు సంరక్షణ తప్పసరి. వేసవిలో సూర్య రశ్మి బారిన పడితే జుట్టు దెబ్బతింటుంది. బయటికెళ్తున్నప్పుడు స్కార్ఫ్ కట్టుకోవడమో, టోపీ పెట్టుకోవడమో తప్పనిసరి.


అసలే వేడి, మళ్లీ హెయిర్ డ్రయర్లు వాడకం కూడా. వేసవిలో మాత్రం హెయిర్ డ్రైయర్ల వాడకాన్ని పూర్తి తగ్గిస్తే జుట్టు అందంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. జుట్టు రాలడం ఆపు చేస్తుంది. కొబ్బరినూనె వేడి చేసి అందులో నిమ్మరసం కలిపి దాన్ని తలకి పట్టించుకుంటే 5, 6 గంటలు ఆగి ఆ తరువాత శీకాయతో తలస్నానం చేస్తే వెంట్రుకల చివరలు చిట్లిపోకుండా ఉంటాయి. తలకు క్యాబేజీ ఆకుల రసం పట్టించి గంటసేపు ఆగి తలస్నానం చేస్తే శిరోజాలు బాగా పెరుగుతాయి. తల స్నానం చేసిన తర్వాత తలకు సాంబ్రాణి పొగవేసుకుంటే శిరోజాలకు మంచి సువాసన కలుగుతుంది.


తలస్నానానికి ముందు కొద్దిగా ఉసిరికపొడి నీటిలో నానబెట్టి వుంచి స్నానం పూర్తయ్యాక ఉసిరిక పొడి నానపెట్టిన నీటిని చిలకరించి పైతేటను తలపై పోసుకుంటే శిరోజాలు ఎర్రబడకుండా నిగనిగలాడతాయి. వేసవిలో వేడినీళ్లతో స్నానం చేయకపోవడమే మంచిది. తలస్నానం అసలే వద్దు. జుట్టు పొడిబారిపోకుండా వారానికి ఒకటి రెండుసార్లయినా నూనె రాసుకోవాలి.


ఇక స్విమ్మింగ్ ఫూల్స్ లోని నీళ్లలో క్లోరిన్ కలుపుతారు. క్లోరిన్ కేశసౌందర్యానికి శత్రువు. ఇంటికి రాగానే మంచి షాంపూతో తలస్నానం చేయడం మంచిది. జుట్టు ఒత్తుగా పెరగాలంటే తల స్నానం చేయబోయే గంట ముందు గోరువెచ్చని కొబ్బరినూనెను తలకు పట్టించాలి. తగినన్ని మందార ఆకులను శుభ్రంగా కడిగి గ్రైండ్ చేయాలి. ఆ ముద్దను కూడా తలకు పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే జుట్టుకి పోషణ లభించి నల్లగా ఉంటుంది. గుడ్డు, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ నిమ్మరసం, టేబుల్ స్పూన్ కుంకుడుకాయ రసం, కప్పు హెర్బల్ టీ, ఎసెన్షియల్ ఆయిల్ ఐదు చుక్కలు కలిపి బ్లెండ్ చేయాలి.


ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, వేళ్లతో మాడును వలయాకారంగా రుద్దుతూ, శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండు రోజులు ఈ విధంగా చేస్తుంటే జుట్టు పెరుగుతుంది. పెద్ద పళ్ళు ఉన్న దువ్వెనతో ముందు చిక్కు తీసుకొని, తర్వాత మామూలు దువ్వెనతో దువ్వుకోవటం ద్వారా వెంట్రుకలు రాలటాన్ని అరికట్టుకోవచ్చును. శిరోజాలను సంరక్షించుకోవటంలో శ్రద్ధ వహించిన మీరు మరింత ఆకర్షణగా కనబడగలరు. శిరోజాలే స్ర్తీలకు అందం.

మరింత సమాచారం తెలుసుకోండి: