కావలసిన పదార్థాలు: చిక్కుడుకాయ ముక్కలు : రెండు కప్పులు అన్నం : ఐదు కప్పులు చీల్చిన పచ్చిమిర్చి : ఎనిమిది జీలకర్ర : చెంచెడు అజీనామోటో : చిటికెడు సోయాసాస్ : చిటికెడు కరివేపాకు : ఇరవై రెమ్మలు (సన్నగా తరగాలి) చాట్ మసాలా : అర చెంచెడు నూనె : సరిపడా ఉప్పు : రుచికి తగినంత


తయారు చేయు విధానం : చిక్కుడు కాయ ముక్కలను కాగిన నూనెలో వేయించి తీయాలి. తర్వాత మూకుడులో నూనె వేసి కాగాక పచ్చిమిర్చి, జీలకర్ర, కల్యమాకు వేసి వేగనివ్వాలి. అందులో అజీనామోటో, చిక్కుడు ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. పొడిగా చేసిన అన్నం, సోయాసాస్ దానికి జతచేసి సన్నని మంటపై ఐదారు నిమిషాలు కలుపుతుండాలి.


కొద్దిసేపటి తర్వాత అందులో చాట్ మసాలా చల్లి మరో రెండు నిమిషాల పాటు స్టవ్‌మీద ఉంచి గరిటెతో కలిపి దించుకోవాలి. అంతే! వేడి వేడి ‘చిక్కుడు ఫ్రైడ్ రైస్’ రెడీ!

మరింత సమాచారం తెలుసుకోండి: