పనీర్‌ ముక్కలు – పది, ఉల్లిపాయ – ఒకటి, పచ్చిమిర్చి – రెండు, పసుపు – పావుచెంచా, మెంతిఆకులు – రెండు చెంచాలు, ఇంగువ – చిటికెడు, ఉప్పు – తగినంత, ఆవాలు – చెంచా, కరివేపాకు రెబ్బలు – రెండు.


మసాలాకోసం:
కరివేపాకు రెబ్బలు – మూడు, కొబ్బరితురుము – పావుకప్పు, మిరియాలపొడి – ముప్పావుచెంచా, జీలకర్ర – అరచెంచా, ధనియాలపొడి – చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద – ఒకటిన్నర చెంచా, ఎండుమిర్చి – ఐదు, ఆమ్‌చూర్‌ పొడి – రెండు చెంచాలు, లవంగాలు – రెండు, దాల్చినచెక్క – చిన్నముక్క.

తయారీ చేయు విధానం :
మసాలాకోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ మిక్సీజారులోకి తీసుకుని కాసిని నీళ్లు చల్లి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఆవాలు వేయాలి. ఆవాలు వేగాయనుకున్నాక కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేయించాలి. ఐదారు నిమిషాలయ్యాక ముందుగా చేసుకున్న మసాలా, పసుపూ, మెంతిఆకులు వేయాలి. మసాలా కొద్దిగా వేగాక అరకప్పు నీళ్లూ, ఇంగువా, తగినంత ఉప్పు వేసి మంట తగ్గించాలి. నీళ్లు ఆవిరవుతున్నప్పుడు పనీర్‌ ముక్కల్ని వేయాలి. ఈ కూర దగ్గరకు అయ్యాక దింపేస్తే చాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: