బియ్యం : పావుకిలో  పసుపు ఉప్పు, : సరిపడ చింతపండు : కొంచెం కమలాపండు : తురుము కొంచెం  బెల్లం : చిన్న ముక్క ఉసిరికాయంత  పచ్చిమిర్చి : పదికాయలు  ఎండుమిర్చి : 5 కాయలు పోపుసామాను : సరిపడ కొత్తిమీర : అర కప్పు తరగు కరివేపాకు : 1/ 4 కప్పు ఇంగువ : 1/ 4 చెంచా నూనె : అర కప్పు వేరుశనగ పప్పు గుండ్లు : 3 చెంచాలు  జీడిపప్పు : 50 గ్రాములు పచ్చి శనగపప్పు : 2 చెంచాలు  


తయారీ చేయువిధానం : చింతపండు చిక్కగా తీసి దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, బెల్లం, ఒకటిన్నర గట్టిపడేంతవరకు బాగా చిక్కగా ఉడికించాలి. బియ్యం కడిగి ఒకటికి ఒకటిన్నర నీటిని ఎసరు పోసి ఉడికించి బేసిన్లో పోయాలి. ఉడికించేటప్పుడే కొంచెం పసుపు, 1 చెంచా నూనె పోసి ఉడికించాలి. ఈ అన్నానికి సరిపడ ఉప్పు, పసుపు వేసి గరిటతో బాగా కలపాలి.


బాండీలో పావుకప్పు నూనె పోసి వేరుశనగపప్పు గుండ్లు శనగపప్పు, పోపు సామాను చివరగా జీడిపప్పు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేపాలి. ఈ పోపును సగం చింతపండు రసంలో వేసి 1 నిమిషం ఉడికించ దించి అన్నంలో పోయాలి. బాగా కలిసేట్టు కలపాలి. చివరగా మిగిలిన పోప, కొత్తిమీర వేసి బాగా కలపాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: