కావలసిన పధార్థాలు : అరటికాయలు : 6 క్యాబేజీ ఆకులు : రెండు వబ్బిమిర్చి : ఆరు మొక్కజొన్నపిండి : పది టేబుల్ స్పూన్ మైదా : ఐదు టేబుల్ స్పూన్లు టమాటా సాస్ : నాలుగు చెంచాలు  సోయాబీన్స్ : అర చెంచా చిల్లీసాస్ : రెండు చెంచాలు నూనె : వేయంచడానికి సరిపడా కొత్తిమీర : కట్ట ఆజినోమోటో : అర చెంచా ఉప్పు : సరిపడా తయారీ చేయువిధానం  : అరటీకాయల్ని కాస్త మందంగా చక్రాల్లా తరిగి ఉడికించాలి.


ఆ తర్వాత చెక్కు తీసేయాలి. గిన్నెలో మైదా, మొక్కజొన్నపిండి, తగినంత ఉప్పు వేసి బజ్జీలపిండిలా కలపాలి. బాణలిలో నూనె వేడిచేయాలి. బంగారం కలర్ లోకి వచ్చాక దింపేయాలి.  స్టౌవ్ మీద మరో బాణలి పెట్టి కొద్దిగా నూనె వేసి పొడుగ్గా తరిగిన పచ్చిమర్చి ముక్కలు వేయించి క్యాబేజీ తరుగు చేర్చాలి.


అవి కూడా వేగాక వేయింకుకున్న అరటిముక్కల్ని కూడా చేర్చి. అజినోమోటో, టమాటా, చిల్లీ. సోయా సాస్ లు వేసి బాగా కలపాలి. దింపేముందు కొత్తిమీర చల్లితే సరిపోతుంది. అరటికాయ మంచూరియా రెడీ అయిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: