చిక్కుడు బంగాళదుంపలు కర్రీ కావాలసిన పధార్థాలు : చిక్కుడు : ¼ కేజీ 1 కప్ బంగాళ దుంప : 2  కారం : 1 టీస్పూన్ ఉప్పు : రుచికితగ్గట్టు పోపుకోసం : లవంగాలు,  చెక్క : చిన్న ముక్క ఆవాలు : 1 స్పూన్ జీలకర్ర: 1 స్పూన్ ఉద్దిపప్పు : 1 టీస్పూన్ ఎండుమిర్చి : 4-5  ఇంగువ : చిటికెడు  కరివేపాకు : రెండు రెమ్మలు నూనె : సరిపడా


తయారు చేయు విధానం : ముందుగా బంగాళాదుంపలను కావల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి. అలాగే చిక్కడు కాయలను రెండువైపుల తొనలు తీసి మధ్యకు కట్ చేసి పెట్టుకోవాలి.(కట్ చేసే ముందు చిక్కడు కాయను అనపకాయ వలిచినట్లు వలిచి లోపల శుభ్రంగా ఉందో లేదా చూసుకోవాలి.కాయ ఎంత బాగున్నా కొన్నింటిలో పురుగు ఉంటుంది.) ఇప్పడు ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి అందులో తగినంత ఉప్పు అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేసి మీడియంగా ఉడికించుకోవాలి.


 తర్వాత కిందకి దింపుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోవాలి.  తర్వాత మరో గిన్నెలో కొద్దిగా నీళ్లు, ఉప్పు, కట్ చేసుకొన్న చిక్కడుకాయలను వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని, నీరు వొంపి పక్కన పెట్టుకోవాలి. (బంగాళదుంప , చిక్కడు రెండూ ఒకేసారి ఉడికిస్తే, చిక్కుడు కాయా త్వరగా ఉడికి, బంగాళదుంప సగం కూడా ఉడకకుండా ఉంటుంది. 


కాబట్టి రెండూ వేరు వేరు గా ఉడికించుకోవడం మంచిది.) తర్వాత పాన్ లో నూనె వేసి, వేడయ్యాక పోపు దినుసులు ఒక దాని తర్వాత ఒకటి వేసి దోరగా వేయించుకోవాలి. పోపు దోరగా మారే సమయంలో బంగాళదుంపల ముక్కలను యాడ్ చేయాలి. రుచికి తగినట్టు ఉప్పు, కారంను అడ్జెస్ట్ చేసుకుంటూ మరో ఐదు నిమిషాలపాటు ఫ్రై చేసి కిందకి దింపుకొని వేడి వేడి అన్నం సర్వ్ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: