కావలసిన పదార్దాలు :  కాప్సికం : రెండు  కోడి గ్రుడ్లు : రెండు ఉల్లిపాయలు : ఒకటి  కారం : అర టీ స్పూన్ పసుపు : పావు టీ స్పూన్ మిరియాల పొడి : అర టీ స్పూన్ ఉప్పు : తగినంత నూనె : మూడు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్  తయారుచేయు విధానం :  కళాయి లో నూనె పోసి వేడి చేసుకోవాలి.  నూనె కాగాక ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.  


వేగాక కొంచం పసుపు వేసి కలిపాలి. తరువాత కోడి గ్రుడ్లను వేసి ఉప్పు, కొంచం మిరియాల పొడి వేసి కలిపిఐదు నిముషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి.  ఇప్పుడు కాప్సికం ముక్కలను వేసి చిన్న మంట మీద ఐదు నిముషాల ఉడక నివ్వాలి.  ఇప్పుడు కారం, ఉప్పు వేసి సన్నటి మంట మీద మరో ఐదు నిముషాలు పాటు ఉంచి వేడి వేడి గా వడ్డించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: