కందగడ్డ వేపుడు కావలసిన పదార్థాలు: కందగడ్డ : పావు కిలో మిరపకాయలు : ఎనిమిది ధనియాలు : చెంచెడు పసుపు : చిటికెడు నూనె : సరిపడా ఉప్పు : తగినంత తయారు చేసే పద్ధతి: కందగడ్డ చెక్కు తీసి బిళ్ళల మాదిరిగా కోసుకోవాలి.

మిరపకాయలు, ధనియాలు, ఉల్లిముక్కలు, ఉప్పు, పసుపు అన్నీ కలిపి ముద్ద నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని కందముక్కలకు పట్టించి అరగంట పాటు ఉంచాలి. తర్వాత మూకుడులో నూనె వేసి వేడయ్యాక కంద ముక్కలను రెండు వైపులా ఎర్రగా గోలించి దించుకుంటే సరి. కందవేపుడు రెడీ!  

మరింత సమాచారం తెలుసుకోండి: