దీపావళి అంటేనే తిపి పదార్థలతో ఇంటిల్లిపాది ఎంతో ఆనందంగా ఆరగిస్తుంటారు.  అయితే భారత దేశంలో దీపావళి సందర్భంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పిండి వంటలు చేస్తుంటారు.  అయితే అందరికీ ఇష్టమైన రసగుల్లా దీపావళి స్పెషల్.  పాల రసగుల్లా ఎలా తయారు చేస్తారో చూద్దామా..

కావలసిన పదార్థాలు  :

విరిగిన పాలు - ఒక లీటరు

డాల్డా - 200 గ్రాములు
పంచదార   - 400 గ్రాములు
యాలకులు  - 4


తయారు చేయు విధానం :

- ముందుగా ఒక గిన్నెలో విరిగిన పాలు పోసి పొయ్యి మీద సన్నని సెగ మీద నీరంతా ఇంకేంతా వరకు పెట్టండి.  నీళ్లంతా ఆవిరి అయిన తర్వాత పొడిగా జున్నులా తయారవుతుంది. 

- తయారు చేసుకున్న పొడిని తడి చేతులతో చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి.
- అనంతరం పొయ్యి మీద మూకుడిని పెట్టి అందులో డాల్డాని వేసి మరిగించాలి.
- డాల్డా వేడి అయిన తర్వాత అందులో పాల ఉండలు వేసి వేగనివ్వాలి. అప్పడప్పుుడు గరిటెతో కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండలను వేయించాలి.
- తర్వాత ఒక గిన్నెలో నీళ్లు మరియు పంచదాని వేసి పాకం పట్టుకోవాలి. ఆ పాకంలో ఉండలు మరియు యాలకుల పొడిని చలి ఒక గంట సేపు నానబెడితే రుచికరమైన పాల రసగుల్లా తయార్. ఇవి చిన్న పిల్లలు ఎంతగానో ఇష్టపడి తింటారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: